Begin typing your search above and press return to search.

ఆ సీనియర్ హీరోయిన్.. ఇన్నాళ్ళకు పెళ్లి బాజాలు

యంగ్ హీరో రామ్ పోతినేని జోడీగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:35 PM GMT
ఆ సీనియర్ హీరోయిన్.. ఇన్నాళ్ళకు పెళ్లి బాజాలు
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అలరించిన బ్యూటీల్లో కృతి కర్బంద ఒకరు. బోణీ సినిమాతో వెండితెరకు పరిచయమైందీ భామ. కానీ ఆ సినిమాతో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్ మార్, మిస్టర్ నూకయ్య చిత్రాల్లో కనిపించింది. యంగ్ హీరో రామ్ పోతినేని జోడీగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.


అయితే చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది కృతి. కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీ.. త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ వీరు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎంగెేజ్మెంట్ ఫొటోస్ ఫుల్ వైరల్ అయ్యాయి.

కృతి- పుల్కిత్ ఎంగేజ్మెంట్ ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. నెట్టింట వైరలైన ఫొటోల్లో కృతి, పుల్కిత్ చేతికి ఒకే రకమైన ఉంగరాలు కనిపించాయి. అలాగే ఆ ఫొటోల్లో ఇల్లంతా అందంగా అలంకరించారు. ఈ ఫొటోలను పుల్కిత్ మాత్రమే తన ఇన్ స్టాలో షేర్ చేశారు. కానీ ఈ విషయం పై కృతి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

తాజాగా ఈ ఏడాదిలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పరోక్షంగా తెలిపింది కృతి. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తన ప్రియుడు పుల్కిత్ తో దిగిన పిక్ ను షేర్ చేసింది. లెట్స్ 'మార్చ్' టుగెదర్ అంటూ రాసుకొచ్చింది. దీంతో వారిద్దరూ మార్చిలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడికి వాలెంటైన్స్ డే విషెస్ తెలిపింది. ఫొటోలో ఇద్దరూ ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు

పుల్కిత్ సామ్రాట్ గతంలో శ్వేతా రోహిరాను 2014లో వివాహం చేసుకున్నారు. కానీ మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకున్నారు. అయితే పుల్కిత్ 2019 నుంచి కృతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి తైష్, పాగల్ పంటి, వీరే ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు. పుల్కిత్ ప్రస్తుతం రిస్కీ రోమియో చిత్రంలో నటిస్తున్నారు. మరి ఈ లవ్లీ కపుల్ ఇంట్లో పెళ్లి భాజాలు ఎప్పుడు మోగుతాయో చూడాలి.