రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫోటో ఒక్కటైనా ఉందా..?
మెగా సపోర్ట్ తో హీరోగా ఎదిగి తనకంటూ స్టార్ డం వచ్చాక సొంత ఆర్మీ అంటూ పెట్టుకున్నాడు అల్లు అర్జున్.
By: Tupaki Desk | 13 Feb 2025 3:00 AM GMTస్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఈమధ్య మరింత ఎక్కువైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజైతే చాలు మరో హీరో ఫ్యాన్స్ అంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. సినిమా ఏమాత్రం తేడా వచ్చినా దాన్ని తొక్కేస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య రైవల్రీ రోజు రోజుకి తారాస్థాయి చేరుతుంది. ఈమధ్య మెగా ఫ్యామిలీ హీరోల మధ్య ఈ ఫ్యాన్ వార్ ఎక్కువైంది. మెగా సపోర్ట్ తో హీరోగా ఎదిగి తనకంటూ స్టార్ డం వచ్చాక సొంత ఆర్మీ అంటూ పెట్టుకున్నాడు అల్లు అర్జున్. తన ఫ్యాన్స్ ని అలా పిలవడంతో అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య అక్కడ నిప్పు రాజుకుంది..
మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తన కష్టంతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఒక సందర్భంలో చెప్పను బ్రదర్ అన్న మాట పవర్ స్టార్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ కి అతను టార్గెట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ ని దూరం పెడుతూ వస్తున్నారు. ఐతే ఈమధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అల్లు అర్జున్ ఒక అభ్యర్ధికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ ని మరింత హర్ట్ చేసింది. దానికి వారు అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు.
ఐతే అల్లు ఆర్మీ కూడా దీనికి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్లు మెగా ఫ్యాన్స్ కి ఎక్కడా తగ్గకుండా ఎటాకింగ్ మోడ్ లో ఉన్నారు. ఈ ఫ్యాన్ వార్స్ పీక్స్ కి వెళ్తున్నా కూడా హీరోలు మాత్రం ఏమి పట్టనట్టుగా ఉంటున్నారు. ఫ్యాన్ వార్స్ గురించి ఈమధ్య ఎక్కువ చర్చిస్తున్నామంటే.. అది ఏ స్థాయికి చేరిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ఫ్యాన్ వార్స్ ఇలా ఉంటే దీన్ని కంట్రోల్ చేసేందుకు హీరోలు కూడా ప్రయత్నించినట్టు కనిపించలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, రాం చరణ్ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ కలిసినా కూడా ఆ ఫోటోలు బయటకు రాలేదు. సినిమా రిలీజ్ టైం లో ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎక్కువ అవుతుంది. ఈ విషయం స్టార్ హీరోలకు తెలిసినా కూడా వారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు.
ఐతే ఇలానే వదిలేస్తే పరిశ్రమకు నష్టమని భావించి మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 గురించి.. రాం చరణ్ గురించి అల్లు అరవింద్ మాట్లాడారు. మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వైరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలైనట్టే తెలుస్తుంది. ఐతే ఫ్యాన్ వార్స్ ఈ ఇద్దరి మధ్యే కాదు మిగతా హీరోల మధ్య జరుగుతుంది. మిగతా స్టార్స్ కూడా దూరం దూరం అన్నట్టు ఉంటున్నారు. అందరు కలిసి ఉంటే ఫ్యాన్స్ కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది.
ఈమధ్య ఫ్యాన్స్ వార్స్ పీక్స్ కి చేరాయి.. ఒక హీరో సినిమా పైరసీని మరో హీరో ఫ్యాన్స్ ప్రమోట్ చేసే రేంజ్ కి వెళ్లాయి. ఇది కచ్చితంగా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదు. ఐతే నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్టార్స్ కూడా తమ వంతు బాధ్యతగా మేమంతా ఒక్కటే సినిమాల మధ్య పోటీ తప్ప మేమందరం కలిసే ఉన్నామన్న సంతేకాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం పరిణామాలు ఇంకా తీవ్రతరంగా మారే అవకాశాలు ఉన్నాయని అర్దమవుతుంది
ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎప్పటి నుంచో ఉన్నా కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియా కాలంలో దాని తీవ్రత మరింత పెరిగింది. అభిమానులంతా కూడా తమ హీరో ని ఆరాధించడమే కాకుండా ఇతర హీరోలను ధూషించడంలో కూడా ముందుంటున్నారు. స్టార్స్ అంతా కూడా వారి మధ్య పోటీ సినిమాల మధ్య మాత్రమే కానీ పర్సనల్ గా కాదు మేమంతా కలిసే ఉంటామన్న ఆలోచన ఫ్యాన్స్ కి కలిగేలా చేయాలి. అలా చేయాలంటే స్టార్స్ మిగతా స్టార్స్ తో కలిసి టైం స్పెండ్ చేస్తుండాలి. అఫ్కోర్స్ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకసారి స్టార్స్ అంతా కలిసి ఒక గెట్ టు గెదర్ లా పెట్టుకుంటే ఈ ఫ్యాన్ వార్స్ ని కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది.