Begin typing your search above and press return to search.

నయనతారకు షాక్ ఇచ్చిన కోర్టు..!

ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ ధాన్ క్లిప్స్ ను అతని పర్మిషన్ తో వేసుకోవాలి నిర్మాత పర్మిషన్ లేనిది వేసుకోకూడదు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 8:33 AM GMT
నయనతారకు షాక్ ఇచ్చిన కోర్టు..!
X

లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీలో నాన్ రౌడీ ధాన్ వీడియో క్లిప్ ఆ సినిమా నిర్మాత ధనుష్ పర్మిషన్ లేకుండా వాడుకున్నారని ధనుష్ వారి మీద 10 కోట్ల ఫైన్ వేశాడు. ఈ విషయం మీదే ధనుష్ ని టార్గెట్ చేస్తూ నయనతార ఓపెన్ లెటర్ రాసింది. ఓపెన్ లెటర్ తో మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది. ఐతే నయనతర, ధనుష్ కేసు విచారణ రాగా నయనతరకు కోర్ట్ మొట్టికాయలు వేసింది. ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ ధాన్ క్లిప్స్ ను అతని పర్మిషన్ తో వేసుకోవాలి నిర్మాత పర్మిషన్ లేనిది వేసుకోకూడదు.

అంతేకాదు ఈ ఇష్యూపై నయనతార నుంచి క్లారిటీ రావాలని కోర్టు ఆదేశించింది. జనవరి 8 లోగా నయనతార సమాధానం చెప్పాలని కోర్టు చెప్పింది. ఇంతకీ నయనతార క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ధనుష్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కాబట్టి అతను డిమాండ్ చేయడంలో తప్పులేదు. అలా కాకుండా అతని పర్మిషన్ లేకుండా ఆ క్లిప్స్ వాడటం చట్టరీత్యా నేరమే అవుతుంది.

ధనుష్ తో కలిసి ఇదివరకు స్క్రీన్ షేర్ చేసుకున్న నయన్ ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంది. ఐతే ఈ ఇష్యూపై కోలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా సైలెంట్ గా ఉన్నారు. మరి నయన్ వర్సెస్ ధనుష్ ఫైట్ లో గెలుపు ఎవరిని వరిస్తుంది. వారిద్దరి మధ్య సంధి కుదిర్చే మార్గం ఎవరు చేస్తరన్నది చూడాలి.

సినిమాల విషయానికి వస్తే నయన్ చేతి నిండా సినిమాలతో దూసుకెళ్తుంది. ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కొడై సినిమాలు చేస్తున్నాడు. ఇడ్లీ కొడై సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ ఈమధ్యనే వచ్చి సక్సెస్ అందుకుంది. అందుకే మళ్లీ నటిస్తూ దర్శకత్వం చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ధనుష్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అందుకే ఇక్కడ కూడా ఆయనకు క్రేజీ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి అవార్డింగ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఐతే కమర్షియల్ గా కూడా కుబేర నెక్స్ట్ లెవెల్ ఉంటుందని టాక్.