ది ఐ ట్రైలర్ టాక్..!
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన మొదటి హాలీవుడ్ సినిమాగా ది ఐ చేస్తుంది. కొన్నాళ్లుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది.
By: Tupaki Desk | 26 Feb 2025 6:19 PM GMTసౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన మొదటి హాలీవుడ్ సినిమాగా ది ఐ చేస్తుంది. కొన్నాళ్లుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది. ది ఐ ట్రైలర్ చూస్తే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. ది ఐ ట్యాగ్ లైనే చావు అన్నదే ఎండ్ కాకపోతే ఏం జరుగుతుంది అన్నది పెట్టారు. హ్యాపీగా బోయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ లైఫ్ ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. అంతేకాదు ఎవరో తనని చూస్తున్నట్టు ఆమెకు అనిపిస్తుంది.
ఇంతకీ అసలు ఏం జరుగుతుంది.. దీని వెనుక ఉన్నది ఎవరు.. వాటికి కారణాలు ఏంటి తెలియాలంటే ది ఐ చూడాల్సిందే. ది ఐ సినిమాలో మార్క్ రౌలే శృతికి జోడీగా నటిస్తున్నాడు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రైలర్ మాత్రం ఇంప్రెసివ్ గా ఉంది. ముందుగా శృతి హాసన్ లుక్ అప్పియరెన్స్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. శృతి హాసన్ ఈమధ్య సౌత్ సినిమాలు తగ్గించింది. ఐతే హాలీవుడ్ సినిమాకు అమ్మడికి మంచి పేరు వచ్చేలా ఉంది.
ది ఐ సినిమాను డాఫ్నె షోమాన్ డైరెక్ట్ చేయగా ఎమిలీ కార్ల్ టన్ ఈ సినిమా కథ అందించారు. ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ముఖ్యంగా హాలీవుడ్ లో ఎన్నొచ్చినా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఐతే శృతి హాసన్ ఈ సినిమాలో నటించడం ప్రత్యేకంగా ఉంది.
మరి శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ ఎలాంటి రిజల్ట్ అందిస్తుంది అన్నది చూడాలి. ప్రతి హీరోయిన్ ఫైనల్ గా హాలీవుడ్ సినిమాలో నటించాలన్న డ్రీం ఉంటుంది. బహుశా శృటి హాసన్ కి ది ఐ తో ఆ కల నెరవేరిందని చెప్పొచ్చు. సినిమా సైకలాజికల్ థ్రిల్లరే అయినా శృతి హాసన్ ఫ్యాన్స్ కోరుకునే బోల్డ్ అంశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ది ఐ సినిమా శృతి హాసన్ కి హాలీవుడ్ లో సూపర్ హిట్ తో వెల్కం చెబుతుందా లేదా అన్నది చూడాలి. ఐతే శృతి మాత్రం ఈ సినిమాకు ది బెస్ట్ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. మరి రిజల్ట్ ఆమెకు సంతృప్తికరంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.