Begin typing your search above and press return to search.

గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర హంగామా..!

శుక్రవారం రిలీజ్ కాబోతున్న దేవర సినిమాను అన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

By:  Tupaki Desk   |   25 Sep 2024 3:54 PM GMT
గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర హంగామా..!
X

శుక్రవారం రిలీజ్ కాబోతున్న దేవర సినిమాను అన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ముఖ్యంగా ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా ఎక్కువగా బాలీవుడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు తారక్. ఇప్పటికే కరణ్ జోహార్ ఇంటర్వ్యూతో సినిమా గురించి బీ టౌన్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసిన తారక్ లేటెస్ట్ గా కపిల్ శర్మ షోలో హంగామా చేశారు. బాలీవుడ్ లో కపిల్ శర్మ షోకి ఎంత పెద్ద క్రేజ్ ఉందో తెలిసిందే.

ఐతే కపిల్ శర్మ షో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం గ్రేట్ ఇండియన్ కపిల్ షోగా మారింది. దీనిలో భాగంగా దేవర టీం తో కపిల్ షో ఎంటర్టైనింగ్ గా సాగింది. ఎన్ టీ ఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ షోలో పాల్గొన్నారు. బాలీవుడ్ లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరిని తారక్ ని కపిల్ అడగ్గా శ్రీదేవి అని చెప్పారు. ఐతే వెంటనే సౌత్ నుంచి ఆమె నాకు ఫేవరెట్ అని అన్నారు సైఫ్ అలీ ఖాన్. ఇక జాన్వి కపూర్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పారు తారక్.

జాన్వి కూడా సౌత్ ఇడ్లీ సాంబార్ ఇష్టమని చెప్పింది. ఇక కపిల్ శర్మ షోలో ఆటల్లో భాగంగా ఎన్టీఆర్, సైఫ్ లకు టాస్క్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో కపిల్ షోలో బాహుబలి స్పూఫ్ చేశారు. ఇలా గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రోమోతోనే సూపర్ జోష్ ఇచ్చారు. తప్పకుండా ఈ ఎపిసోడ్ అటు బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. ఎన్ టీ ఆర్ దేవర మీద బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ కాబోతున్న దేవర స్పెషల్ గ్రేట్ ఇండియన్ కపిల్ షో కోసం తారక్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రోమోలో కపిల్ తో తారక్, సైఫ్ ఆటలు సరదగా ఉన్నాయి. తప్పకుండా ఈ షో తో దేవర మీద మరింత బజ్ పెరిగే చాన్స్ ఉందని చెప్పొచ్చు.