Begin typing your search above and press return to search.

అమ్మ‌పై ప్రేమ ఇంత పెద్ద స్టార్‌ని చేసింది

ఈ మొత్తం ఎపిసోడ్ లో క‌థానాయ‌కుడు మ‌రెవ‌రో కాదు ది గ్రేట్ సూర్య‌. క‌ల‌లో కూడా న‌టుడ‌వ్వాల‌నుకోలేద‌ని సూర్య తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

By:  Tupaki Desk   |   9 Nov 2024 9:30 PM GMT
అమ్మ‌పై ప్రేమ ఇంత పెద్ద స్టార్‌ని చేసింది
X

తాను ఒక పెద్ద స్టార్ కి భార్య‌. కానీ త‌న భ‌ర్త‌కు తెలియ‌కుండా 25 వేలు అప్పు తీసుకుని చెల్లించ‌లేక‌పోయాన‌ని కుమారుడికి చెప్పింది. ఆ మాట విని షాక్ తిన్న ఆ యువ‌కుడు వెంట‌నే తాను ఎలాగైనా ఆ అప్పు తీర్చాల‌నుకున్నాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం రూపంలో అదృష్టం త‌మ ఇంటిని వెతుక్కుంటూ వ‌చ్చింది. త‌మ చిత్రం నుంచి ఒక న‌టుడు వైదొలిగారు... మీ అబ్బాయి కావాలంటూ అడిగారు. అలా వ‌చ్చిన అవ‌కాశాన్ని వెంట‌నే స‌ద్వినియోగం చేసుకున్నాడు ఆ యువ‌కుడు. మ‌ణిర‌త్నం కాళ్లు ప‌ట్టుకుని 50 వేలు తీసుకుని త‌న త‌ల్లికి ఆ డ‌బ్బును ఇచ్చాడు అప్పు తీర్చేయ‌మ‌ని. అలా అమ్మ మీద ప్రేమ‌తో అత‌డు న‌టన‌లోకి ప్ర‌వేశించాడు.

అప్ప‌టికి అత‌డికి న‌టుడు అవ్వాల‌నే ఆలోచ‌న లేదు. త‌న ఆస‌క్తిని అనుస‌రించి వ‌స్త్ర వ్యాపారం చేసుకుని బ‌తికేయాల‌నుకున్నాడు. కానీ విధి విచిత్ర‌మైన‌ది. ఎప్పుడు ఎవ‌రిని ఏ అవ‌కాశం వ‌రిస్తుందో చెప్ప‌లేం. అదృష్టం ఎలా వెతుక్కుంటూ వ‌స్తుందో కూడా ఊహించ‌లేం. అనుకోని అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టాడు. న‌టుడ‌య్యాడు. చివ‌రికి స్టార్ గా ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. ఇప్పుడు అగ్ర హీరోగా ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్నాడు. త‌న‌ను అమితంగా ప్రేమించే అభిమానుల‌ను చూశాక ఈ రంగంలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అగ్ర హీరోగా ఎదిగాక స‌హ‌న‌టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో క‌థానాయ‌కుడు మ‌రెవ‌రో కాదు ది గ్రేట్ సూర్య‌. క‌ల‌లో కూడా న‌టుడ‌వ్వాల‌నుకోలేద‌ని సూర్య తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అలాగే న‌టుడు అయ్యాక చాలా తిర‌స్కారాల‌కు అవ‌మానాల‌కు గురయ్యాన‌ని తెలిపాడు.పెద్ద న‌టుడి కొడుకు కాబ‌ట్టి వార‌సుడిగా ఈ రంగంలోకి వ‌చ్చాడ‌ని విమ‌ర్శించారు. అత‌డి లుక్స్ బాలేద‌ని తూల‌నాడిన వారు ఉన్నారు. ఏడెనిమిది సినిమాల వ‌ర‌కూ అస‌లు త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోనే లేదు. న‌టుడిగా ప‌నికి రావ‌ని అన్న‌వారు ఉన్నారు. కానీ పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకున్నాడు. న‌టుడిగా త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. తండ్రిని మించిన త‌న‌యుడిగా ఎదిగాడు. ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయ‌కుడిగా నేడు అసాధార‌ణ‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు. అత‌డి భార్య జ్యోతిక ప‌రిశ్ర‌మ‌లో అగ్ర న‌టి. వారి వార‌సులు ఎదిగేస్తున్నారు. న‌టుడు సూర్య స్టోరి నిజంగా ఒక సినిమా క‌థ‌నే త‌ల‌పిస్తోంది క‌దూ?