Begin typing your search above and press return to search.

నైజాంలో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాలివే..

ఇదిలా ఉంటే నైజాం ఏరియాలో హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' ఉంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 11:00 AM GMT
నైజాంలో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాలివే..
X

స్టార్ హీరోలందరికి నైజాం ఏరియా బంగారు బాతులాంటిది. తెలుగు రాష్ట్రాలలో సినిమాలకి ఎక్కువ ఆదరణ లభించేది నైజాం ఏరియాలోనే. నైజాంలో కంటే ఆంధ్రాలో సినిమాలకి బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. అలాగే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రా కంటే నైజాం ఏరియానే చాలా సార్లు టాప్ లో ఉంటుంది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి సినిమాలకి నైజాం ఏరియాలో సాలిడ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే నైజాం ఏరియాలో హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ‘బాహుబలి 2’ సూపర్ సక్సెస్ కావడంతో నెక్స్ట్ రాజమౌళి నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అత్యధికంగా 70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీని తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ఏకంగా 65 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ నైజాంలో జరిగింది. తరువాత ‘సలార్’ మూవీ పైన 60 కోట్ల బిజినెస్ అయ్యింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకి కూడా 50 కోట్ల బిజినెస్ జరగడం విశేషం.

వీటి తర్వాత టాప్ 5లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర పార్ట్ 1’ నిలిచింది. నైజాంలో ఈ సినిమాపై 44 కోట్ల బిజినెస్ అయ్యింది. ఎన్టీఆర్ కెరియర్ పరంగా చూసుకుంటే నైజాం ఏరియాలో సోలోగా అతనికిదే హైయెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. బిజినెస్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ టాప్ లో ఉన్న అది రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ‘దేవర’ తర్వాత స్థానంలో 42 కోట్ల నైజాం థీయాట్రికల్ బిజినెస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' నిలిచింది. తరువాత 40 కోట్ల బిజినెస్ తో ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమాలు టాప్ 7, 8 స్థానాలలో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా పైన నైజాంలో 38 కోట్ల బిజినెస్ అయ్యింది. టాప్ 10లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ 36.50 కోట్ల బిజినెస్ తో నిలిచింది. వీటి తరువాత వరుసగా ‘పుష్ప’, ‘సర్కారువారిపాట’ ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’, ‘అజ్ఞాతవాసి’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే నైజాంలో అత్యధిక బిజినెస్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో డార్లింగ్ ప్రభాస్ మూవీస్ ఏకంగా 6 సినిమాలు ఉండటం విశేషం.

ఆర్ఆర్ఆర్ సినిమా – 70 కోట్లు

కల్కి 2898ఏడీ – 65 కోట్లు

సలార్ – 60 కోట్లు

ఆదిపురుష్ – 50 కోట్లు

దేవర పార్ట్ 1 – 44.00 కోట్లు***

గుంటూరు కారం – 42.00 కోట్లు

బాహుబలి 2 – 40 కోట్లు

సాహో – 40 కోట్లు

ఆచార్య – 38 కోట్లు

రాధే శ్యామ్ – 36.50 కోట్లు

పుష్ప – 36 కోట్లు

సర్కారు వారి పాట – 36 కోట్లు

భీమ్లా నాయక్ – 35 కోట్లు

బ్రో ది అవతార్ – 30 కోట్లు

అజ్ఞాతవాసి – 29.50 కోట్లు

సైరా – 28 కోట్లు