థియేటర్ రిలీజ్ పై ఓటీటీ ఇంపాక్ట్!
రిలీజ్ ఎప్పుడు ఎలా చేయాలి? అని నిర్మాతతో చర్చించుకుని ఓ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లే వారు.
By: Tupaki Desk | 31 Oct 2024 3:30 PM GMTథియేట్రికల్ బిజినెస్ కంటే ఇప్పుడు ఓటీటీ బిజినెస్ అత్యంత కీలకంగా మారిందా? థియేట్రికల్ రిలీజ్ ని సైతం ఓటీటీ శాషిస్తోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఒకప్పుడు థియేటర్ రిలీజ్ అంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఇలా బోలెడంత హంగామా ఉండేది. రిలీజ్ కి ముందు విళ్లంతా నిర్మాతలతో మమేకమయ్యేవారు. రిలీజ్ ఎప్పుడు ఎలా చేయాలి? అని నిర్మాతతో చర్చించుకుని ఓ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లే వారు.
కానీ ఇప్పుడా సీన్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ ని ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి? అన్నది ఓటీటీ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే సినిమా సెట్స్ లో ఉండగానే కోట్ల రూపాయల డీల్ నిర్మాతతో కుదుర్చుకుంటుంది. దీంతో నిర్మాతో ఓటీటీ యాజమాన్యం చేతుల్లోకి వెళ్తున్నాడు. వాళ్లు చెప్పిన తేదికి రిలీజ్ చేయాల్సిన సన్నివేశం కనిపిస్తుంది. వాళ్ల మధ్య జరిగే కోట్ల రూపాయల ఒప్పందమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.
ఎందుకంటే ఓటీటీ రిలీజ్ చేయాలంటే? థియేట్రికల్ రన్ అనంతరం ఆరువారాలు..ఎనిమిది వారాలు అనే కండీషన్ ఉంది. స్ట్రీమింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే? నిర్మాత ఆ కండీషన్ కి కట్టుబడి పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా `గేమ్ ఛేంజర్`, `తండేల్` లాంటి సినిమాలు వాయిదా పడటానికి కారణం ఇదే అని కొందరంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్లను ముందుగా డిసైడ్ చేసిన తర్వాత థియేట్రికలర్ రిలీజ్ తేదీ ఫిక్స్ చేసుకుంటున్నారు.
లేదంటే తమ పెట్టుబడికి రిలీజ్ తేది అన్నది అతి పెద్ద నష్టంగా మారుతుందని ఓటీటీ యాజమాన్యాలు భావిస్తున్నాయట. గతంలో థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీ లో రిలీజ్ అయ్యేది. అదంతా నిర్మాత చేతుల్లో ఉండేది. ఇప్పుడా సన్నివేశం పూర్తిగా రివర్స్ లో ఉంది. భవిష్యత్ లో మరిన్ని మార్పులకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.