Begin typing your search above and press return to search.

మ్యూజిక్ లెజెండ్ ఫీల‌య్యాడా?

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు సంగీత ద‌ర్శ‌కుడు బాగా ఫీల‌య్యాడ‌నే ఓ వార్త కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 12:30 AM GMT
మ్యూజిక్ లెజెండ్ ఫీల‌య్యాడా?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు స‌ద‌రు డైరెక్ట‌ర్ తెలుగు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయితే బాగుంటుంద‌ని అత‌డినే ఎంపిక చేసాడు. మంచి సంగీతం కూడా అందించాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా వేడుక అమెరికాలో గ్రాండ్ గా నిర్వ‌హించారు. అందులో టీమ్ అంతా పాల్గొంది. అయితే ఆ వేడుక‌లో ఓ చీఫ్ గెస్ట్ క‌నిపిస్తాడ‌ని కొంద‌రు ఆశించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు.

ఆ చీఫ్ గెస్ట్ దేశంలోనే పేరున్న సంగీత ద‌ర్శ‌కుడ‌ని తెలిసింది. కానీ ఈవెంట్ లో ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. వాస్త‌వానికి ఈ సినిమా డైర‌క్ట‌ర్ కి- సంగీత ద‌ర్శ‌కుడికి మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ ఉంది. ఇద్ద‌రు క్లోజ్ ప్రెండ్స్ లా ఉంటా రు. ఆ కాంబినేష‌న్ లో చాలా హిట్ సినిమాలొచ్చాయి. సాధారణంగా ఆ పేరున్న డైరెక్ట‌ర్ సినిమా అనౌన్స్ చేసాడంటే? మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌న స్నేహితుడే అవుతాడు త‌ప్ప మ‌రొక‌ర‌కి ఛాన్స్ ఎందుకుంటుంది అనుకుంటారు.

కానీ కొత్త సంగీత ద‌ర్శకుడిని తెర‌పైకి తెచ్చి స‌ర్ ప్రైజ్ చేసారు. ఇదంతా జ‌రిగిందేదో జ‌రిగిపోయిందనుకుంటే? ఈవెంట్ కు అయినా ఆ సంగీత ద‌ర్శ‌కుడిని ఆహ్వానించారంటే అదీ జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు సంగీత ద‌ర్శ‌కుడు బాగా ఫీల‌య్యాడ‌నే ఓ వార్త కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. తన‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకోక‌పోగా క‌నీసం ఈవెంట్ కి కూడా ఆహ్వానించ‌లేద‌నే అసంతృప్తిని స‌న్నిహితుల వ‌ద్ద వెల్లుబుచ్చాడుట‌.

దీంతో డైరెక్ట‌ర్ -మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ధ్య ఏదైనా క్లాష్ ఉందా? అన్న అంశం చ‌ర్చకొస్తుందిప్పుడు. వాస్త‌వానికి ఆ పేరున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ అదే స్టార్ హీరో త‌దుప‌రి సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమా డైరెక్ట‌ర్ కూడా అమెరికా ఈవెంట్ కి హాజ‌ర‌య్యాడు. కానీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డం ఎన్నో సందేహాల‌కు తావిస్తుంది.