Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లోనే ది ప్యార‌డైజ్ నుంచి ఫ్యాన్స్ కు ట్రీట్

అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి వ‌చ్చింది లేదు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 8:36 AM GMT
త్వ‌ర‌లోనే ది ప్యార‌డైజ్ నుంచి ఫ్యాన్స్ కు ట్రీట్
X

ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో హిట్ః ది థ‌ర్డ్ కేస్ సినిమా చేస్తున్న నాని దాంతో పాటూ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టిన విష‌యం తెలిసిందే. త‌న‌కు ద‌స‌రా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందించిన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో నాని ఇప్ప‌టికే ఓ సినిమాను మొద‌లుపెట్టాడు. ప్ర‌స్తుతం నాని హిట్3 తో పాటూ శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా చేస్తున్నాడు.

ద‌స‌రా సినిమాను నిర్మించిన సుధాక‌ర్ చెరుకూరినే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ది ప్యార‌డైజ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ద‌స‌రా సినిమా త‌ర్వాత శ్రీకాంత్- నాని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ది ప్యార‌డైజ్ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. మొద‌టి సినిమానే ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డైరెక్ట‌ర్ గా తెర‌కెక్కించిన శ్రీకాంత్, ఈ సినిమా కోసం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప‌క్కా యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో ది ప్యార‌డైజ్ సినిమా మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి వ‌చ్చింది లేదు. దీంతో ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు ది ప్యార‌డైజ్ నుంచి ఓ స్పెష‌ల్ గ్లింప్స్ ను రెడీ చేయాల‌ని ప్లాన్ చేశారు.

దాదాపు గ్లింప్స్ కు సంబంధించిన వ‌ర్క్ అంతా అయిపోయింద‌ని, మ్యూజిక్ ద‌గ్గ‌రే ఆగిపోయింద‌ని తెలుస్తోంది. అనిరుధ్ ఇంకా ఈ గ్లింప్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే గ్లింప్స్ లేట‌వుతుంద‌ని స‌మాచారం. నిర్మాత‌ల ప్లాన్ అనుకున్న‌ట్టు జ‌రిగితే మాత్రం ది ప్యార‌డైజ్ గ్లింప్స్ ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.

అయితే ది ప్యార‌డైజ్ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్న విష‌యం తెలిసిందే. అనిరుధ్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్లే నాని సినిమాకు ప‌ని చేయ‌డం లేట‌వుతుంద‌ని స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌లో ప‌ని పూర్త‌వుతుంద‌ని అనిరుధ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో రెండు మూడు రోజుల్లో ది ప్యార‌డైజ్ గ్లింప్స్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవకాశ‌ముంది.