Begin typing your search above and press return to search.

రాజా సాబ్ సెట్స్ లో మారుతి కష్టం! గ్లింప్స్ చూశారా?

టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. డెబ్యూ తో సాలిడ్ హిట్ అందుకున్నారు

By:  Tupaki Desk   |   8 Oct 2024 12:02 PM GMT
రాజా సాబ్ సెట్స్ లో మారుతి కష్టం! గ్లింప్స్ చూశారా?
X

టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. డెబ్యూ తో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస సినిమాలను తెరకెక్కించారు. బస్టాప్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. చివరగా.. పక్కా కమర్షియల్ సినిమాలు తీశారు. కానీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు.

ఆ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో మారుతి మూవీ అంటూ కొన్ని నెలల క్రితం అనౌన్స్మెంట్ రాగానే అంతా షాక్ అయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్ సలార్ మూవీ కన్నా ముందే ప్రభాస్, మారుతి కాంబోలో రాజా సాబ్ పట్టాలెక్కింది. కాగా, ఇప్పటి వరకు మేకర్స్.. రాజా సాబ్ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

అయితే నేడు మారుతి బర్త్ డే కావడంతో.. సెలబ్రిటీలు, సినీ ప్రియులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో రాజా సాబ్ టీమ్ కూడా స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటికే శరవగేంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్ కోసం మారుతి పడుతున్న కష్టాన్ని, పలు సీన్ల కోసం ఆయన నెరేట్ చేస్తున్న విధానాన్ని వీడియోలో చూపించింది. గ్లింప్స్ చివరలో ప్రభాస్, మారుతి కలిసి ఉన్న చిన్న క్లిప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ప్రస్తుతం రాజా సాబ్ టీమ్ రిలీజ్ చేసిన గ్లింప్స్... సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సినిమా కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్ల తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. డార్లింగ్ కు మంచి హిట్ ఇచ్చేయండి సర్ అని సందడి చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే మారుతి సర్ అని పోస్టులు పెడుతున్నారు. రాజా సాబ్ టీమ్ పోస్ట్ చేసిన గ్లింప్స్ ను ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు. సినిమా కోసం మారుతి సర్ బాగా కష్టపడుతున్నారని చెబుతున్నారు.

అయితే రాజా సాబ్.. హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఇలాంటి జోనర్ లో రాజా సాబ్ చేస్తుండడంతో అందరి దృష్టి మూవీపై పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ ను మెన్షన్ చేశారు. మరి రాజా సాబ్.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.