Begin typing your search above and press return to search.

రాజా సాబ్ వచ్చేశాడు.. ఈసారి హారర్ కిక్

ఒక అడవిలో పియానో వద్ద కనిపించని ఆత్మ హ్యాపీ బర్త్ డే అంటూ వాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్‌లో ప్రభాస్ వాయిస్‌తో హమ్మింగ్ వస్తుండటంతో థ్రిల్ ఫీల్ కలిగించేలా ఉంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 10:05 AM GMT
రాజా సాబ్ వచ్చేశాడు.. ఈసారి హారర్ కిక్
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మర్చిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ‘ద రాజా సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ.. మరోసారి తన స్టార్ ఇమేజ్ ని ప్రూవ్ చేసుకునేలా సిద్ధమవుతున్నారు. ఈ హారర్ కామెడీ డ్రామాతో ప్రభాస్ అభిమానులను థ్రిల్ చేసేలా రెడీ అవుతున్నాడు. ఈ రోజు విడుదలైన మోషన్ పోస్టర్ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేసింది.

మోషన్ పోస్టర్ మొదటి షాట్‌లోనే ఆసక్తి రేపింది. ఒక అడవిలో పియానో వద్ద కనిపించని ఆత్మ హ్యాపీ బర్త్ డే అంటూ వాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్‌లో ప్రభాస్ వాయిస్‌తో హమ్మింగ్ వస్తుండటంతో థ్రిల్ ఫీల్ కలిగించేలా ఉంది. ఈ సీన్స్ అన్నీ ఫ్యాన్స్ ని సినిమా ఎలా ఉండబోతుందో ఊహించేలా చేశాయి. మరుసటి షాట్‌లో ఒక పాత, భయానకమైన బంగ్లా కనిపించడం, అందులో ప్రభాస్ రివర్స్ లోనే సింహాసనంపై కూర్చోవడం, అతని గెటప్.. మామూలుగా లేదు.

చుట్ట కాలుస్తూ, షార్ప్ లుక్.. ప్రభాస్ గెటప్ చూసి ఫ్యాన్స్ అబ్బురపడిపోయారు. అందులో ప్రభాస్ లుక్ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. గంభీరం, రాయల్టీ, పవర్ అన్నీ మిళితమైన ఆ లుక్ సినిమాకు కొత్త హైప్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా, హారర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ టచ్ కూడా ఉండబోతుందని మోషన్ పోస్టర్ లో ఉన్న సున్నితమైన హింట్స్ తో తెలుస్తోంది. ఇది సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేసింది.

‘ది రాజా సాబ్’ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ఆకట్టుకున్న మారుతి.. ఈసారి హారర్ కామెడీకి సరికొత్త ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మరొకపక్క, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లాంటి అందాల తారలు నటిస్తున్నారు.

తమన్ ఇప్పటికే సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. తన మ్యూజిక్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌ను ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా, గ్రాఫిక్స్ పరంగా ‘దిరాజా సాబ్’ సినిమా హై స్టాండర్డ్స్ తో ఉండబోతుందని ట్రేడ్ వర్గాల టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 10 భారీ స్థాయిలో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. మరోసారి రెబెల్ స్టార్ ప్రభాస్ తనదైన మాస్ స్టైల్ తో బాక్సాఫీస్‌ పై హవా చూపించడానికి సిద్ధం అవుతున్నారు.