Begin typing your search above and press return to search.

రాజా సాబ్ అదంతా ఉత్తుత్తేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా మీద రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 4:01 AM GMT
రాజా సాబ్ అదంతా ఉత్తుత్తేనా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా మీద రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఒక్క మోషన్ పోస్టర్ తప్ప మిగతా ఏది వదల్లేదు. రెబల్ ఫ్యాన్స్ ఏమో రాజా సాబ్ నుంచి అప్డేట్స్ అడుగుతున్నారు. ఈలోగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.

పభాస్ రాజా సాబ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సినిమాలో నయనతార స్పెషల్ సాంగ్ చేస్తుందని అన్నారు. అంతేకాదు సినిమాలో నయన్ సాంగ్ అదిరిపోతుందని అంటున్నారు. ఐతే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అసలు నయనతార స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పదు. ఎంత పభాస్ తో అంతకుముందు ఒక సినిమా చేసినా కూడా ఆమె ఇప్పుడు సాంగ్ చేయడానికి ఏమాత్రం సుముఖంగా లేదు.

అదీగాక ఈమధ్య అసలు తెలుగు సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించని నయనతార అసలు స్పెషల్ సాంగ్ కి ఎలా ఒప్పుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఐతే నయన్ ని ఒప్పిస్తే మాత్రం ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. నయనతార తెలుగులో సినిమాలు చేసినా తన పోర్షన్ ఏదో కంప్లీట్ చేసుకుని వెళ్తుంది. సినిమా ప్రమోషన్స్ లో అసలు పాల్గొనదు. మరి అలాంటి భామకు కోట్లు కుమ్మరించి సాంగ్ చేయడం కన్నా వేరే హీరోయిన్ ని తీసుకోవడం బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారు.

ఈమధ్య స్పెషల్ సాంగ్స్ అంటే హీరోయిన్స్ కూడా రెడీ అనేస్తున్నారు. పుష్ప 1 లో సమంత, పార్ట్ 2 లో శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నర్తించింది. తప్పకుండా ప్రభాస్ రాజా సాబ్ లో స్టార్ హీరోయిన్ ఒకరు ఈ సాంగ్ లో కనిపించే ఛాన్సులు ఉన్నాయి. ఐతే నయనతార చేస్తుందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె తన సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది.

ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో పాటు ఫౌజి, స్పిరిట్ లైన్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కల్కి 2 కి కూడా డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేయగా ఇప్పుడు ఆ సినిమా అనుకున్న టైం కు వస్తుందా లేదా అన్న డౌట్ మొదలైంది. సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువ అవుతుండటం వల్ల వాయిదా పడుతుందని ఫిల్మ్ నగర్ టాక్.