Lucky Baskhar.. టైటిల్ స్పెల్లింగ్ వెనుక రీజన్ ఏంటి?
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 31వ తేదీన రానుంది.
By: Tupaki Desk | 29 Oct 2024 8:52 AM GMTమాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 31వ తేదీన రానుంది.
ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. వాటిని రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ పెంచేసింది. మూవీ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని క్లారిటీ వచ్చింది. ఓ బ్యాంకు ఉద్యోగి ధనవంతుడిగా ఎలా మారాడన్న కాన్సెప్ట్ తో సినిమా రూపొందినట్లు అర్థమవుతోంది. ముంబైలోని బ్యాంకులో పనిచేసే ఉద్యోగి భాస్కర్ రోల్ లో దుల్కర్ సల్మాన్, ఆయన భార్యగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.
అయితే మూవీ టైటిల్ లక్కీ భాస్కర్ ను మేకర్స్ ఇంగ్లీష్ లో Lucky Bhaskar బదులు Lucky Baskhar అని వేస్తున్నారు. అందుకు కారణమేంటో మేకర్స్ రివీల్ చేయకపోయినా.. పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా Lucky Bas##rd అనేది ఆంగ్లంలో అనుచిత పదమన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు సామర్థ్యం మించి ఎవరైనా ఏమైనా సాధిస్తే ఆ వర్డ్ నే ఉపయోగిస్తారు.
ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను పరిగణనలోకి తీసుకుని Bas##rdలో మొదటి మూడు అక్షరాలను తీసుకుని Lucky Baskhar అని పెట్టారని నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో తమిళంలో Baskaran లేదా Baskar అని పలుకుతారు. khని ఎప్పుడూ ఉపయోగించరు. దానిని కూడా దృష్టిలో మేకర్స్ పెట్టుకున్నారని అంటున్నారు. ఇక నార్త్ ఇండియాతో పాటు తెలుగులో Bhaskar అని రాస్తారు.
అంటే మొత్తం 7 అక్షరాలు ఉపయోగిస్తారు. దీంతో ఇప్పుడు మేకర్స్ మొదటి మూడు అక్షరాలను Bas##rdలో తీసుకుని.. మొత్తం లెటర్ కౌంటర్ సరిపోయేలా Baskhar అని మేకర్స్ పెట్టారని చెబుతున్నారు. అలా అన్ని భాషల్లో పలకడానికి వీలుగా ఉంటుందని అలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కానీ వారి ఉద్దేశం ఏంటి అనేది క్లియర్ గా తెలియదు. దీనిపై రిలీజ్ కు ముందే మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.