Begin typing your search above and press return to search.

'ది రోషన్స్' డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్.. ది రోషన్స్ టైటిల్ తో రూపొందిస్తున్న డాక్యుమెంటరీని రీసెంట్ గా అనౌన్స్ చేసింది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 12:30 PM GMT
ది రోషన్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు డాక్యుమెంటరీల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నయనతార లైఫ్ ఆధారంగా రూపొందిన నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ మంచి రెస్పాన్స్ అందుకుంది. మరో రెండు రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ బియాండ్ అండ్ బిహైండ్ డాక్యుమెంటరీ రిలీజ్ కానుంది.

అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యామిలీపై డాక్యుమెంటరీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్.. ది రోషన్స్ టైటిల్ తో రూపొందిస్తున్న డాక్యుమెంటరీని రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఎప్పటి నుంచో ఆ విషయంపై నెట్టింట వార్తలు వస్తుండగా.. ఇటీవల అఫీషియల్ గా ప్రకటించింది.

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసి.. మరుపురాని జ్ఞాపకాలను రోషన్ ఫ్యామిలీ అందించిందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. వీరి జర్నీలోని ఒడుదొడుకులు, అద్భుతాలను నెట్‌ ఫ్లిక్స్‌ లో చూడండని చెప్పింది. హృతిక్‌, ఆయన తండ్రి రాకేష్ రోషన్‌, తాతయ్య రోషన్‌ సేవలు, పర్సనల్ లైఫ్ గురించి డాక్యుమెంటరీలో చూపించనుంది నెట్ ఫ్లిక్స్.

దీంతో డాక్యుమెంటరీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవగా.. తాజాగా నెట్ ఫ్లిక్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. జనవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని తెలిపింది. అదే సమయంలో సూపర్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో తాతయ్య, తండ్రితో కలిసి హృతిక్ రోషన్ వేరే లెవెల్ లో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్ బాగుందని చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ డాక్యుమెంటరీ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ రూపొందించిన నయన్ డాక్యుమెంటరీ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో.. ది రోషన్స్ పై అంచనాలు ఉన్నాయని అంటున్నారు.

మరోవైపు, ఫైటర్ సినిమాతో 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హృతిక్ రోషన్. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు సూపర్ హిట్ మూవీ వార్ సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తున్నారు. 2025లో ఆ సినిమా విడుదలవ్వనున్న విషయం తెలిసిందే.