Begin typing your search above and press return to search.

ర‌హ‌స్యాలంటున్నారు? సెన్సార్ అడ్డు చెప్ప‌దుగా!

ఇదంతా ఎందుకు అంటే? దివంగ‌త మాజీ ప్ర‌ధాని విధించిన `అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి` (ఎమ‌ర్జెన్సీ) ని ఆధారంగా చేసుకుని కంగ‌న సినిమా చేసిన పాపానికి.

By:  Tupaki Desk   |   20 Sep 2024 10:30 PM GMT
ర‌హ‌స్యాలంటున్నారు?  సెన్సార్ అడ్డు చెప్ప‌దుగా!
X

కంగ‌నా ర‌నౌత్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `ఎమ‌ర్జెన్సీ` వివాదాస్ప‌ద అంశాలు ఏమున్నాయో తెలియ‌దుగానీ ఆ సినిమా రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తామంటూ హెచ్చ‌రిక‌లు...మ‌రోవైపు ఏకంగా కంగ‌న‌ని చంపేస్తామ‌ని దుండగుల బెదిరింపులు.. ఇంకోవైపు సిక్కు సంఘాల అభ్యంత‌రం..చివ‌రిగా సెన్సార్ బోర్డ్ ద‌గ్గ‌ర కూడా అవాంత‌రాలు..ఇంకా ముందుకెళ్తే కోర్టులో స్టేలు ఎదుర్కుంటుందీ సినిమా.

ఇదంతా ఎందుకు అంటే? దివంగ‌త మాజీ ప్ర‌ధాని విధించిన `అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి` (ఎమ‌ర్జెన్సీ) ని ఆధారంగా చేసుకుని కంగ‌న సినిమా చేసిన పాపానికి. నేడు కేంద్రంలో బిజేపీ అధికారంలో ఉంది. అదే బీజేపీలో కంగ‌న ఎంపీగా కొన‌సాగుతుంది. అయినా త‌న సినిమాకి సెన్సార్ చేయించుకోలేని ప‌రిస్థితుల్లో ఉంది. ఈ సినిమా ప‌రిస్థితే ఇలా ఉందంటే? `ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్` ప‌రిస్థితి ఏంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

22 ఏళ్ల క్రితం నాటి ర‌హ‌స్యాల్ని బ‌య‌ట‌కు తీస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ ఓరేంజ్ లో ప్ర‌చారం చేస్తోంది. బ‌య‌ట‌కు రాని ఎన్నో వాస్త‌వాల్ని త‌మ సినిమా ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌బోతున్నాం అంటున్నారు. ఎంతో మంది జీవితాల్ని త‌ల్లకిందులు చేసిన గోద్రా రైలు ద‌హ‌న కాండ‌ను ఆధారంగా చేసుకుని `ది స‌బ‌ర్మ‌తి రిపోర్టు` రెడీ అవుతోంది. రంజ‌న్ చందేల్ దీన్నీ తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో విక్రాంత్ మాస్సే జ‌ర్న‌లిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. న‌వంబ‌ర్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది బీజేపీ ప్ర‌భుత్వ‌మే. అప్పుడు వాజ్ పాయి ప్ర‌ధానిగా ఉన్నారు. మ‌రి దేశానికి తెలియ‌ని ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామంటూ యూనిట్ ప్ర‌చారం చేస్తోన్న నేప‌థ్యంలో రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేసిరికి రిపోర్టు పై ఎలాంటి ప‌రిస్థితులుంటాయో చూడాలి.