గోద్రా ఘటనపై 'ది సబర్మతి రిపోర్ట్'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇప్పటికే మూవీని నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
By: Tupaki Desk | 7 Nov 2024 4:24 AM GMTబాలీవుడ్ నటుడు, 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే.. ప్రస్తుతం ది సబర్మతీ రిపోర్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో రాశీ ఖన్నా, రిద్ది డోగ్రా హీరోయిన్లు గా నటిస్తున్నారు. గోద్రా దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీని నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
కొద్ది రోజుల క్రితం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన గోద్రా ఘటన చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. డేరింగ్ జర్నలిస్ట్ గా విక్రాంత్ నటిస్తున్నట్లు, రాశీ ఖన్నా తోటి రిపోర్టర్ గా, సీనియర్ యాంకర్ గా రిద్ధి యాక్ట్ చేస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు టీజర్ కు వచ్చిన స్పందనతో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ లో విక్రాంత్ మెస్సే సబర్మతి ఎక్స్ ప్రెస్ పై జరిగిన దాడి వెనుక నిజాన్ని వెలికితేసేందుకు పోరాడుతున్నట్లు చూపించారు మేకర్స్. ఆంగ్ల కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో పోరాడుతూ కనిపించారు. పోలీసులు తీసుకెళ్తుంటే పవర్ ఫుల్ డైలాగ్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు విక్రాంత్. ట్రైలర్ చివర్లో రైలుపై దాడి జరుగుతున్నట్లు, ట్రైన్ తగలబడుతున్నట్లు చూపించే సన్నివేశాలు.. ఒక్కసారిగా సినిమాపై ఆస్తకి రేపాయి.
సినిమాలో క్యాస్టింగ్ అంతా పవర్ ఫుల్ గా నటించినట్లు ట్రైలర్ ద్వారా క్లియర్ గా అర్థమవుతోంది. విక్రాంత్ మస్సే, రిద్ధి డోగ్రా అదరగొట్టేశారు. 12th ఫెయిల్, ది సబర్మతి రిపోర్ట్ చిత్రాల్లో విక్రాంత్ పోషించిన రోల్స్ మధ్య చాలా పోలికలు ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. రెండు పాత్రల్లో విక్రాంత్ ఒదిగిపోయారని అంటున్నారు. కానీ రెండు రోల్స్ సెపరేట్ జోనర్ అని రీసెంట్ గా ఆయన క్లారిటీ ఇచ్చారు.
అదే సమయంలో రాశీ ఖన్నా యాక్టింగ్ కూడా అదిరిపోయిందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ బాగుందని రివ్యూ ఇస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయని అంటున్నారు. అయితే నిజజీవిత సంఘటనలు, వివాదాలపై ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ద కశ్మీర్ ఫైల్స్, ద కేరళ స్టోరీ చిత్రాలు అలాంటివే అని చెప్పవచ్చు. ఆ సమయంలో కాంట్రవర్సీలు జరిగాయి. మరి ఇప్పుడు సబర్మతీ రిపోర్ట్ మూవీ విషయంలో ఏమవుతుందో చూడాలి.