Begin typing your search above and press return to search.

ఐసీ 814 ది కాంధార్ హైజాక్ ఎలా ఉంది..?

సౌత్ మేకర్స్ ఇంకా వెబ్ సీరీస్ ల మీద అంత ఫోకస్ చేయట్లేదు కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం హాలీవుడ్ తరహాలో భారీ వెబ్ సీరీస్ లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:40 AM GMT
ఐసీ 814 ది కాంధార్ హైజాక్ ఎలా ఉంది..?
X

ఒకప్పుడు ఏదైనా కథ రాసుకుంటే దాన్ని సినిమాలా మాత్రమే తీయాల్సి ఉంటుంది. చిన్న పాయింట్ అయినా సరే దానికి అటు ఇటు కొంత స్టోరీ యాడ్ చేసి సినిమా తీసేవారు. ఐతే OTTలు వచ్చాక చెప్పాలనుకున్న కథను ఎలాంటి డీవియేషన్ లేకుండా చెప్పేస్తున్నారు. అంతేకాదు సినిమాలో ఉండే పాటలు లేకుండా కథనం నడిపిస్తుంటారు. వెబ్ సీరీస్ ల వల్ల చాలా వరకు సినిమాల మీద ఇంపాక్ట్ పడిందన్న మాట నిజమే కానీ కొన్ని కథలు అవి సినిమాగా చెప్పడానికి కుదరనివి వెబ్ సీరీస్ లుగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

సౌత్ మేకర్స్ ఇంకా వెబ్ సీరీస్ ల మీద అంత ఫోకస్ చేయట్లేదు కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం హాలీవుడ్ తరహాలో భారీ వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సీరీస్ లో రియలిస్టిక్ కథ అంటే మరి కాస్త ఆసక్తి ఉంటుంది. అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ తోనే తెరకెక్కిన సీరీస్ ఐసీ 814 ది కాంధార్ హైజాక్. పాతికేళ్ల క్రితం జరిగిన హైజా నేపథ్యంతో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ లో విజయ్ వర్మ, నసీరుద్ధీ షా, పంకజ్ కపూర్, కూద్ మిశ్రా, అరవింద స్వామి నటించారు. ఈ వెబ్ సీరీస్ ను అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇంతకీ ఈ వెబ్ సీరీస్ కథ ఏంటంటే.. 176 మంది ప్రయాణికులతో ఉన్న విమానం ఐసీ 814 టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. పైలెట్ తలపై తుపాకీ పెట్టి ఫ్లైట్ ని బాబూల్ వైపు తరలిస్తారు. ఇంతకీ ఆ ఫ్లైట్ కాబూఒల్ వెళ్లింద..? టెర్రరిస్ట్ ఎందుకు విమానాన్ని హైజాజ్ చేశారు.. వారి డిమాండ్ లు ఏంటి..? ప్రయాణీకులను కాపాడేందుకు భార ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఐసీ 814 కాంధార్ హైజాక్ కథ.

సినిమా అయినా వెబ్ సీరీస్ అయినా ఫిక్షన్స్ స్టోరీ అయితే దర్శకుడు ఏం చేసినా చెల్లుతుంది కానీ రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించిన సీరీస్ లకు ఆ ఫ్రీడం ఉండదు. జరిగిన దాన్నే చెప్పాల్సి ఉంటుంది. ఐతే అక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా తన ప్రతిభ చూపించారు. సీరీస్ లో ఎక్కడ వాస్తవాలను పక్కదారి పట్టించకుండా తెరకెక్కించారు.

శ్రింజయ్ చౌదరి రాసిన ఫ్లైట్ ఇన్ టూ ఫియర్ బుక్ ఆధారంగా తెరకెక్కిన సీరీస్ ఇది. కాంధార్ హైజాక్ కథతో సీరీస్ మొత్తం ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు దర్శకులు. కాఠ్మండు నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం ముందు పరిస్థితులతో సీరీస్ మొదలు పెట్ట్ ఫ్లైట్ హైజాక్ అయ్యేంత వరకు కథను ఆడియంబ్స్ ను ఎంగేజ్ అయ్యేలా చేశాడు. ఈ సీరీస్ చూస్తున్నంత సేపు రామ్ మద్వాని డైరెక్ట్ చేసిన నీర్జా గుర్తుకొస్తుంది. అంతేకాదు నాగార్జున చేసిన గగనం కూడా గుర్తుకొస్తుంది. ఈ సీరీస్ కు డైరెక్షన్ ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. యాక్టర్స్ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన ఈ సీరీస్ ఆ పరిస్థితులను చూపించిన విధానం కూడా బాగుంది. ఐతే టెర్రరిస్ట్, ప్రభుత్వాల మధ్య చర్చల టైం లో జరిగే డ్రామా కాస్త ఎక్కువ అయ్యింది. దానితో పాటు థ్రిల్ అయ్యే అంశాలు పెద్దగా ఏమి లేవన్నది ఈ సీరీస్ నెగిటివ్ గా చెప్పుకోవచ్చు. కానీ ఈ తరహా హైజాక్ నేపథ్యంతో ఈమధ్య సీరీస్లు, సినిమాలు రాలేదు కాబట్టి ఆరు ఎపిసోడ్ లు ఉన్న ఈ ఐసీ 814 ది కాంధార్ హైజాక్ వీకెండ్ ఫ్రీ టైం లో చూసేయొచ్చు.