ఓటీటీ ఫిల్మ్ ది స్టోరీ టెల్లర్ కు గుడ్ రెస్పాన్స్
కానీ ఈ సినిమా రాకపోతే మాత్రం ఆడియన్స్ ఒక మంచి సినిమాను మిస్ అయ్యేవారు.
By: Tupaki Desk | 29 Jan 2025 2:37 PM GMTకంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా ఆడియన్స్ కు లేట్ గానే రీచ్ అవుతాయి అనడానికి ది స్టోరీ టెల్లర్ సినిమానే ఉదాహరణ. ఈ సినిమా 2022లోనే బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది కానీ ఆడియన్స్ ను చేరుకోవడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పటికైనా వచ్చిందని ఆనందపడటమే తప్ప చేసేదేం లేదు. కానీ ఈ సినిమా రాకపోతే మాత్రం ఆడియన్స్ ఒక మంచి సినిమాను మిస్ అయ్యేవారు.
సత్యజిత్ రే రాసిన షార్ట్ స్టోరీ గోల్పో బోలియో తారిణి ఖురో ఆధారంగా అనంత్ మహదేవన్ ది స్టోరీ టెల్లర్ ను రూపొందించాడు. పరేష్ రావల్, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా చూశాక ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడంలో ఈ సినిమా మాస్టర్ క్లాస్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమాలోని లొకేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి లొకేషన్లను వెళ్లకుండా గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసుకుని ఆ లొకేషన్లలో సినిమాను తీసినట్టు చూపించొచ్చు. కానీ అది అందరికీ కుదరదు. అయితే స్టోరీ టెల్లర్ సినిమా చాలా భాగం కలకత్తా నేపథ్యంలోనే ఉంటుంది. మహదేవన్ సినిమాను సిటీలోనే షూట్ చేసినా దాన్ని తెరపై మాత్రం చాలా అందంగా ప్రెజెంట్ చేశాడు.
డైరెక్టర్ గా అనంత్ మహదేవన్ ఏ ఫ్రేమ్‌ను వృధా చేయకుండా ప్రతీ ఫ్రేమ్ ఎంతో అందంగా, గొప్పగా తెరకెక్కించాడు. నటీనటుల క్యారెక్టరైజేషన్ నుంచి వారి నటన వరకు, సినిమాటోగ్రఫీ నుంచి ఎడిటింగ్ వరకు అన్నీ సరిగ్గా కుదరడంతో ది స్టోరీ టెల్లర్ అన్ని విధాల బెస్ట్ గా నిలిచింది. అసలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే ది స్టోరీ టెల్లర్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం, మౌత్ టాక్ వల్ల ఈ సినిమాకు ఓటీటీలో వ్యూస్ పెరుగుతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.