ఆ నటుడు తలుపులు కొట్టేవాడన్న సీనియర్ నటి!
ఈ కథ ఎవరికి వర్తిస్తుంది.. అంటే ప్రముఖ నటి, తెలుగమ్మాయి జయలలితకు వర్తిస్తుందని చెప్పాలి.
By: Tupaki Desk | 26 March 2024 2:30 AM GMTచిన్నప్పుడు విన్న ఒక కథ ఇది. ఒక బ్రాహ్మణుడు - ఒక వేశ్య ఇల్లు ఎదురెదురుగా ఉండేవి. ఆ బ్రాహ్మణుడు సంప్రదాయకంగా అన్ని పూజలు చేసేవాడు.. కానీ ఆ వేశ్య ఇంటికి ఎంత మంది విటులు వెళ్తున్నారు అని గమనిస్తూ లెక్కపెట్టే వాడట. కానీ ఆ వేశ్య చాలా భక్తురాలు, వేశ్య వృత్తిలో తప్పక ఉన్నప్పటికీ, ఆమె మనసు లో మాత్రం ఆ దేవుడి గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదట. వాళ్లిద్దరూ మరణించాక ఆ వేశ్య స్వర్గానికి, ఆ బ్రాహ్మణుడు నరకానికి వెళ్లారట. దాని కీ కారణం ఆమె శరీరం మలినము అయినా, మనస్సు మలినం అవలేదు, కానీ ఆ బ్రాహ్మణుడు దస్త్రబద్దంగా అన్ని పూజలు చేసిన అతని మనసు మాత్రం ఆ వేశ్య చేసే పనిపై ఉండేది. అందుకే అతడి మనస్సు మలినం అయ్యింది, అందుకే నరకానికి వెళ్ళాడు.
ఈ కథ ఎవరికి వర్తిస్తుంది.. అంటే ప్రముఖ నటి, తెలుగమ్మాయి జయలలితకు వర్తిస్తుందని చెప్పాలి. అనుకోకుండానే తన తండ్రి వల్ల మద్రాసుకు వెళ్లి హీరోయిన్ గా ప్రయత్నించి, ఆరంభం హీరోయిన్ గా అవకాశాలు అందుకుని, సరైన మార్గదర్శనం లేక ఆ తర్వాత వ్యాంపూ పాత్రలు చేసి, చివరికి వాటిలోనే స్థిరపడి, కుటుంబ పోషణ భారం తనపై ఉండడం వల్ల.. పరిశ్రమలో అవకాశాల కోసం కొందరికి లొంగిపోయి జీవితాన్ని సాగించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె ఇటీవలి మీడియా ఇంటర్వ్యూల్లో ఎంతో నిజాయితీగా అంగీకరించారు. ఆమె కథ వింటే ఎవరైనా కంటతడి పెట్టుకోవాల్సిందే. అన్ని వెదలు ఆమెలో ఉన్నాయి.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభం గురించి, ఆ తర్వాత కష్టనష్టాల గురించి మాట్లాడారు. ఇందులో ఎన్నో విషయాలను నిజాయితీగా మాట్లాడిన తీరు మనసుల్ని కదిలించింది. జయలలిత మాట్లాడుతూ-``ఈ పోరాటం మార్పు కోసం`లో కథానాయికగా కెరీర్ ప్రారంభించాను. తర్వాత నిర్మాతలు హీరోయిన్ గా అవకాశం ఇస్తామని ఇవ్వలేదు. అటుపై మలయాళ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూ వచ్చిన అనంతరం మలయాలంలో నటిగా బిజీ అయ్యాను. మలయాళంలో ఉప్పు సినిమాలో తల్లి కూతుళ్లుగా ద్విపాత్రల్లో నటించాను. మలయాళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు దక్కింది. అనుకోకుండానే కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడులో వ్యాంపు పాత్రలో చేశాక.. ఆ తర్వాత అలాంటి పాత్రల్లోనే అవకాశాలొచ్చాయి`` అని తెలిపారు. కుటుంబం ముందుకు సాగడం కోసం ఎలాంటి పాత్రలకు అయినా అంగీకరించాల్సొచ్చిందని అన్నారు.
అంతేకాదు.. తన జీవితంలో చీకటి కోణాల గురించి కూడా ఆమె నిజాయితీగా మాట్టాడారు. ఒక నటుడు రూమ్ కి వచ్చి పదే పదే తలుపులు కొట్టేవాడన్న సీనియర్ నటి జయలలిత.. ఒక పెద్ద నటుడు తాను కుదరదు అంటే ఉరి వేసుకుంటానన్నాడని తెలిపారు. పరిశ్రమ లో కొందరి నుంచి తప్పించుకున్నాను.. కొందరిని తప్పించుకోలేకపోయాను..అని కూడా ఆవేదన చెందారు. తాను మాట్లాడేప్పుడు ఎంతో ఎమోషన్ ని ఆమె దాచుకున్న తీరు హృదయాలను కదిలిస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే తన కుటుంబాన్ని పోషించుకునేందుకే హీరోలు, దర్శకనిర్మాతలకు లొంగిపోవాల్సి వచ్చిందని కూడా తెలిపారు. తాను సంపాదించినదంతా పోగొట్టుకోవడానికి స్వయంకృతమే కారణమని కూడా నిజాయితీగా అంగీకరించారు.
ఎంతో అందమైన జయలలిత కు హీరోయిన్ కి కావలసిన అన్నీ అర్హతలు కలిగి ఉన్న కూడా కొంత మంది దుర్మార్గులు ఆమె ప్రతిభను తొక్కేశారని కూడా కథనాలు గతంలో వచ్చాయి. తన తండ్రి వల్ల తాను జీవితంలో చాలా కోల్పోయింది. ఆ తర్వాత పెళ్లాడిన వాడి వల్ల కూడా నష్టపోయింది. జయ లలిత లాగా నిజాయితీగా ఉన్నవి ఉన్నట్టు చెప్పేవారు సినిమా రంగంలో చాలా తక్కువ మంది ఉంటారనడంలో సందేహం లేదు. జయ లలిత స్టోరీ వింటే చాల బాధ పడకుండా ఉండలేరు. సినిమా రంగంలో భక్తి ముక్తి రక్తి అన్ని చూడటమే కాదు.. నిజాలు నిర్భయంగా చెప్పారు.