Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెండు జడల అందాల ముద్దుగుమ్

కానీ ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:18 AM GMT
పిక్ టాక్ : రెండు జడల అందాల ముద్దుగుమ్
X

తెలుగమ్మాయి దివి బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ కి ముందు దివికి పెద్దగా ఫాలోయింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసే ఫోటోలు నెట్టింట హీట్ ను పుట్టిస్తోంది.


స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా అందాల ముద్దుగుమ్మ దివి తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తుంది. రెగ్యులర్‌ గా స్కిన్‌ షో చేయకుండా ఎక్కువ శాతం చీర కట్టు ఫోటోలను షేర్‌ చేస్తూ అప్పుడప్పుడు ఇలా స్కిన్‌ షో ఫోటోలను కూడా నెట్టింట ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఉంటుంది.

ఆకట్టుకునే అందం తో పాటు ఇలాంటి పొట్టి డ్రెస్ లు వేసిన సమయంలో దివి ముందు చాలా మంది హీరోయిన్స్‌ అందం దిగదుడుపే అన్నట్లుగా కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఉంటారు. నెట్టింట అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉండే ఈసారి క్యూట్‌ గా రెండు జడలతో ఇలా ఆకట్టుకుంది.

ఇక ఈ అమ్మడు సినిమాల్లో మరియు సిరీస్‌ ల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. ఆ మధ్య మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో నటించి తన నటన ప్రతిభను దివి నిరూపించుకుంది. ముందు ముందు మరింతగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇంత అందంగా ఉన్న దివి ఇతర భాషల సినిమాల్లో ప్రయత్నిస్తే కచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దివి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి.