Begin typing your search above and press return to search.

షాకిస్తున్న బిగ్ బాస్ జంట‌ ఆస్తుల విలువ‌!

వివాదాస్పద రియాలిటీ షోలో కలిసినప్పటి నుంచి విడదీయరాని అనుబంధం ఉన్న తేజస్వి ప్రకాష్ - కరణ్ కుంద్రా దుబాయ్‌లో కలిసి సంయుక్త పెట్టుబ‌డితో ఇల్లు కొన్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 11:30 PM GMT
షాకిస్తున్న బిగ్ బాస్ జంట‌ ఆస్తుల విలువ‌!
X

కరణ్ కుంద్రా - తేజస్వి పరాక్ష్ ఇద్దరు అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ ప్రముఖులు. వారు బిగ్ బాస్ 15 హౌస్ లోపల కలుసుకున్నారు. అభిమానులు వారి బంధం ప్రేమాభిమానాల‌ను ఎంతో గౌర‌విస్తారు. ఆటలో వారి బలమైన వ్యక్తిత్వం ఫాలోయింగ్ ని తెచ్చింది. ఈ జోడీ కొన్ని సంవత్సరాలుగా అనేక ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసారు. వారి జాబితాలో ఖ‌రీదైన వ‌స్తువుల గురించి తెలుసుకుంటే నోరెళ్ల‌బెట్టాల్సిందే.


దుబాయ్‌- ముంబైలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ల‌ను సొంతం చేసుకోవడం నుండి రూ. 1 కోటి ఖ‌రీదును అధిగ‌మించిన‌ విలువైన అత్యాధునిక విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడం వరకు తేజస్వి ప్రకాష్ - కరణ్ కుంద్రా దేనిలోను త‌గ్గ‌ర‌ని స‌ర్వే చెబుతోంది.


దుబాయ్ గోవాలో అపార్ట్ మెంట్లు ఈ జంట‌కు ఉన్నాయి. వివాదాస్పద రియాలిటీ షోలో కలిసినప్పటి నుంచి విడదీయరాని అనుబంధం ఉన్న తేజస్వి ప్రకాష్ - కరణ్ కుంద్రా దుబాయ్‌లో కలిసి సంయుక్త పెట్టుబ‌డితో ఇల్లు కొన్నారు. ఈ జంట దుబాయ్‌లోని జుమేరాలో తమ మొట్టమొదటి ఇంటిని కొనుగోలు చేశారు. ఒక సోర్స్ ప్ర‌కారం.. ఆ ఇంటి విలువ దాదాపు రూ.2 కోట్లు. లవ్ బర్డ్స్ వారి అంద‌మైన‌ విలాసవంతమైన దుబాయ్ హౌస్ నుంచి స్నీక్ పీక్ ని షేర్ చేయ‌గా ఆ ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి.


తేజస్వి తన బిగ్ బాస్ 15 విజ‌యం తర్వాత గోవాలో ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేసింది. తేజ‌స్వి త‌న అందం న‌ట‌న‌తో చాలామంది ప్ర‌జ‌ల‌ హృదయాలను గెలుచుకుంది. భారీ ఆదాయ మార్గాల‌ను క‌నుగొంది. దీంతో అనేక విలాసవంతమైన, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసింది. తేజస్వి తన కొత్త గోవా ఇంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నాగిన్ 6 తో తేజ‌స్వి రేంజ్ పెరిగింది. తేజ‌స్వి గత 25 సంవత్సరాలుగా తన ముంబై ఇంట్లో నివసిస్తోంది. ఈ భామ ఓ ఇంటర్వ్యూలో తన టీవీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తన విలాసవంతమైన ముంబై నివాసం తాలూకా వీడియోలు, ఫోటోల‌ను షేర్ చేసింది. ఇంటిలోని రాచరికపు ఇంటీరియర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. తేజస్వి ఇల్లు చాలా వారాలపాటు చర్చనీయాంశంగా మారింది.

కరణ్ కుంద్రా టెలివిజ‌న్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖులలో ఒకరు. ముఖ్యంగా అతని బిగ్ బాస్ 15 ప్రయాణం తర్వాత ఇమేజ్ అమాంతం పెరిగింది. ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఉండే అపార్ట్‌మెంట్ ని కొనాల‌నే తన కలను ఈ టీవీ నటుడు నెరవేర్చుకున్నాడు. అతడు తన బిగ్ బాస్ 15 స్టింట్ తర్వాత బాంద్రాలోని తన ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాడు. ఒక సోర్స్ ప్ర‌కారం.. కరణ్ 20 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. సీ-వ్యూ అపార్ట్‌మెంట్‌తో పాటు, కరణ్ కుంద్రా కొత్త ఇల్లు ఒక ప్రైవేట్ లిఫ్ట్ -స్విమ్మింగ్ పూల్‌ని కలిగి ఉంది.

బిగ్ బాస్ 15 విజేత తేజస్వి ప్రకాష్ కూడా విలాసవంతమైన కారు కొనాలనే తన కలను నెరవేర్చుకుంది. ఈ బ్యూటీ సొగసైన SUVని కొనుగోలు చేసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. బిగ్ బాస్ షో గెలవడానికి ముందే ఏక్తా కపూర్ `నాగిన్ 6` అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న తేజస్వి దాదాపు రూ. 90 లక్షలు- రూ. 1 కోటి విలువైన సరికొత్త ఆడి క్యూ7ని కొనుగోలు చేసింది. ఏప్రిల్ 2022లో ఈ బ్యూటీ కరణ్ కుంద్రాతో కలిసి కారు కొనడానికి వెళ్ళిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

కరణ్‌కు ఒకటి కాదు అనేక ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ నుండి మినీ కూపర్ వరకు అతడు ఖ‌రీదైన బ్రాండెడ్ కార్ల‌ను సొంతం చేసుకున్నాడు. సొగసైన అధునాత‌న‌ కార్లపై కరణ్‌కు ఉన్న ప్రేమ ఎంతో గొప్ప‌ద‌ని అత‌డి గ్యారేజ్ చెబుతోంది. అతడు త‌న అభిరుచిని ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అతడు కొన్న‌ రేంజ్ రోవర్ విలువ దాదాపు రూ. 1.5 కోట్లు. మినీ కూపర్ విలువ దాదాపు రూ. 50 లక్షలు.

కరణ్‌కి అనేక బైక్‌లు ఉన్నాయి. అతని బైక్ ల‌ సేకరణలో హార్లే డేవిడ్‌సన్, డుకాటి స‌హా మరెన్నో ఉన్నాయి. కొన్నేళ్లుగా అతడు తనకు అనేక హై-ఎండ్ బైక్‌లను స్వీయ‌ బహుమతిగా అందుకున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

తేజస్వి- కరణ్ కొంతకాలం క్రితం దుబాయ్‌కి ఒక చిన్న పర్యటన కోసం వెళ్లారు. తేజ‌స్వి అక్క‌డ ఖరీదైన ఆభరణాల వస్తువులను కొనుగోలు చేయాలనే తన కలలను నెరవేర్చుకుంది. తనకు 2 విలాసవంతమైన - ఖరీదైన కార్టియర్ కంకణాలను బహుమతిగా ఇచ్చుకుంది. తన యూట్యూబ్ ఛానెల్‌లోని ఒక వ్లాగ్‌లో త‌న వ‌స్తువ‌ల‌ను ప్ర‌ద‌ర్శించింది. నేను ల‌వ్ బ్రాస్‌లెట్ కొనాలని కోరుకున్నాను.. చివరికి నేను దానిని సొంతం చేసుకున్నాను.. అని తేజ‌స్వి తెలిపింది.