ది బర్త్ డే బాయ్.. పెర్ఫెక్ట్ కామెడీ డ్రామా!
రిపీట్ మోడ్ లో చూసి భారీ లాభాలు అందిస్తున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 7 Jun 2024 2:31 PM GMTసినీ ప్రియుల మైండ్ సెట్ పూర్తిగా మారిన విషయం తెలిసిందే. బడ్జెట్.. కాస్టింగ్.. ఇలాంటి అంశాలతో ఎలాంటి సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే చాలు.. మూవీని హిట్ చేసేస్తున్నారు. కొత్త కంటెంట్ ను ఆదరిస్తున్నారు. వైవిధ్యమైన జోనర్ లో వస్తున్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. రిపీట్ మోడ్ లో చూసి భారీ లాభాలు అందిస్తున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తున్నారు.
తాజాగా ఇదే కోవలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. విభిన్నమైన జోనర్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ది బర్త్ డే బాయ్ మూవీ తెరకెక్కుతోంది. రవి కృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. విస్కి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొమ్మ బొరుసా బ్యానర్ పై వంశీ. జీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు.
ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫన్నీ సంభాషణతో టైటిల్ గ్లింప్స్ ప్రారంభమైంది. ది బర్త్ డే బాయ్ అని కొత్త సినిమా చూస్తున్నట్లు యాక్టర్ చెబుతారు. ఆ తరువాత చిత్రంలోని మిగతా పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. ఫన్నీగా ముఖాలు చూపించారు. అయితే టైటిల్ గ్లింప్స్ వెరైటీగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నట్లు అనిపిస్తోందని అంటున్నారు.
ది బర్త్ డే బాయ్ మూవీలోని ప్రతి రోల్ కూడా ఎంటర్టైన్ చేస్తుందని డైరెక్టర్ విస్కి తెలిపారు. "ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నేచురాలిటీ కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్ తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం ఉండబోతుంది. తప్పకుండా మూవీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని తెలిపారు.
ఈ సినిమాలో ప్రమోదిని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ శ్రీనివాస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఐ.భరత్ వ్యవహరిస్తున్నారు. సింక్ సౌండ్ డిజైనర్ గా సాయి మణిధర్ రెడ్డి.. సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ గా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు. త్వరలో మేకర్స్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.