Begin typing your search above and press return to search.

అంద‌గ‌త్తె అడివి దొంగ అవ‌తారం

నాగిన్ టెలివిజన్ సిరీస్‌తో పాపుల‌రైన మౌని టీవీ రంగం నుంచి వెండితెర‌కు షిఫ్ట‌యినా మునుప‌టి ఛామ్ ని కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మైంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:47 AM GMT
అంద‌గ‌త్తె అడివి దొంగ అవ‌తారం
X

అందానికి అందం ప్ర‌తిభ ఉన్న భామ మౌనిరాయ్. అక్ష‌య్ కుమార్ గోల్డ్ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ బుల్లితెర న‌టి కెరీర్ ఇప్పుడు అంతంత మాత్ర‌మే. నాగిన్ టెలివిజన్ సిరీస్‌తో పాపుల‌రైన మౌని టీవీ రంగం నుంచి వెండితెర‌కు షిఫ్ట‌యినా మునుప‌టి ఛామ్ ని కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మైంది. ఇంత‌లోనే గ్రేట్ కంబ్యాక్ కోసం ఆశిస్తున్న మౌని వ‌రుసగా వేడెక్కించే హాట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.


తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ లేస్ బాడీసూట్‌తో ప్ర‌త్య‌క్ష‌మైంది. త‌న‌లోని హాట్ కంటెంట్ ని ఆరాంగా ఎలివేట్ చేసిన ఈ డ్రెస్ దాని వెన‌క బ్యాక్ గ్రౌండ్ ఆక‌ట్టుకున్నాయి. చిందరవందరగా ఉన్న జుట్టు .. పొడవాటి బూట్లు ధ‌రించి చేతిలో లెద‌ర్ హ్యాట్ తో క‌నిపిస్తోంది. మౌని వేషధారణలో మైండ్‌బ్లోయింగ్‌. చూస్తుంటే కౌగాళ్ లా మారిన‌ట్టుగా ఉంది. ఇక ఈ ఫోటోషూట్ లోని ఒక ఫోటోలో త‌న వెన‌క ఉన్న చంద‌న‌పు దుంగ‌లు చూస్తుంటే మౌని స్మ‌గ్ల‌ర్ గా మారిన‌ట్టుందే! అంటూ అభిమానులు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. మౌని ఫోటోషూట్ పై దిశా ప‌టానీ, ఆక్షా గోరాడియా స్పందించారు. ల‌వ్ హార్ట్ ఈమోజీల‌తో అభిమానం కురిపించారు.

మౌని రాయ్ గత సంవత్సరం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌లో తన నటనతో మైమ‌రిపించింది. అలాగే ఇటీవ‌ల‌ మినీ సిరీస్ `సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ`తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ప్రస్తుతం `ది వర్జిన్ ట్రీ`లో నటిస్తోంది. టాలీవుడ్‌లో అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాల్లో ఉంది ఈ బ్యూటీ. కానీ ఆశించిన స్థాయిలో ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌ని స‌మాచారం.