అమెజాన్ ప్రైమ్ పై కేసు... యాడ్ సమస్య!
నెట్ ఫ్లిక్స్ తర్వాత అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో పై అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు.
By: Tupaki Desk | 13 Feb 2024 1:16 PM GMTగడచిన అయిదు సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. నెట్ ఫ్లిక్స్ తర్వాత అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో పై అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు. అమెజాన్ వారు తనను చీట్ చేశారంటూ ఆయన కేసు పెట్టాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఓటీటీ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో అమెజాన్ ప్రైమ్ తమ ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని భారీగా పెంచింది. ఇప్పుడు కొత్తగా మరో వ్యూహం ను అమెజాన్ తీసుకు వచ్చింది.
అమెరికాతో పాటు మరో రెండు మూడు దేశాల్లో అమెజాన్ యాడ్స్ ను మొదలు పెట్టింది. ఇప్పటికే ఖాతాదారులు అయిన వారు కూడా యాడ్స్ లేకుండా తమ కంటెంట్ ను చూడాలి అంటే మరింత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాదిరిగా పలు రకాల ప్లాన్స్ ను అమెజాన్ తీసుకు వచ్చింది.
గతంలో తాను యాడ్స్ లేకుండా కంటెంట్ చూసేందుకు గాను సబ్‌స్క్రిప్షన్ ను తీసుకున్నాను. ఇప్పుడు యాడ్స్ ఇస్తూ ఆ యాడ్స్ ను తొలగించాలి అంటే మరింత మొత్తం చెల్లించాల్సిందిగా అమెజాన్ డిమాండ్ చేయడంపై సదరు ఓటీటీ వినియోగదారుడు కోర్టును ఆశ్రయించాడు.
తాను తీసుకున్న సబ్‌స్క్రిప్షన్ పూర్తి అయ్యే వరకు కూడా యాడ్ ఫ్రీ కంటెంట్ ఇవ్వాలని, ఆ తర్వాత వారి కొత్త స్కీమ్ ను అమలు చేయాలంటూ కోర్టు ముందు తన పిటిషన్ ను ఉంచాడు. ఇప్పటి వరకు అమెజాన్ వారు ఈ విషయమై స్పందించలేదు. కోర్టు కేసు నేపథ్యంలో అమెజాన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా చూడాలి.