ప్రభాస్ సినిమాకు ఏ సర్టిఫికెట్.. వాళ్లకు ఏం సమాధానం చెబుతారు..?
ప్రభాస్ అలా నిల్చుంటే చాలు అతనికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుదాం అలాంటి ప్రభాస్ తో సలార్ చేశారని ప్రశాంత్ నీల్ ని ప్రశంసించారు రాజమౌళి.
By: Tupaki Desk | 20 Dec 2023 8:25 AM GMTప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ 1 సీజ్ ఫైర్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి ప్రభాస్ తో సలార్ గా వస్తున్నాడు. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ 1 22న రిలీజ్ అవుతుంది.
సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్, సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో నటించిన పృధ్వి రాజ్ తో రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ప్రభాస్ అలా నిల్చుంటే చాలు అతనికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుదాం అలాంటి ప్రభాస్ తో సలార్ చేశారని ప్రశాంత్ నీల్ ని ప్రశంసించారు రాజమౌళి. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎందుకు రావాలన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ. దేవ, వరద రాజ మన్నార్ ల ఫ్రెండ్ షిప్.. వాళ్లిద్దరు ఎలా విరోధులుగా మారారు అన్నదే సలార్ కథ. ఈ సినిమాలో ఎక్కువ డ్రామా ఉంటుందని చెప్పారు ప్రశాంత్ నీల్.
ప్రధాన పాత్రల మధ్య డ్రామా బాగా వర్క్ అవుట్ అయ్యిందని తప్పకుండా అది ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఇక ఈ సినిమా కె.జి.ఎఫ్ కు సంబంధం ఉంటుందా అంటే అలా యూనివర్స్ లా చేయడం తన వల్ల కాదని కె.జి.ఎఫ్ లో రాకీని ఎలా ఇష్టపడ్డారో.. సలార్ లో దేవా, వరదరాజ లను కూడా ఇష్టపడతారని అన్నారు ప్రశాంత్ నీల్.
ప్రభాస్ సినిమా అంటే కిడ్స్ ఇష్టపడతారు కానీ ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చింది. వారికి మీ సమాధానం ఏంటి అని ప్రశాంత్ నీల్ ని అడిగారు రాజమౌళి. సలార్ లో యాక్షన్ సీన్స్ కొన్ని సెన్సార్ టీం అభ్యంతరాలు చెప్పింది అయితే దాన్ని ట్రిమ్ చేస్తే సినిమా ఫీల్ పోతుందని ఉంచమని చెప్పాము. అందుకే సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని అన్నారు. ప్రభాస్ కూడా సినిమా అలా ఉంది కాబట్టి అలా ఇచ్చారు. దానికి మనం ఏం చేయలేమని అన్నారు.
శృతిహాసన్ రెండు సాంగ్స్ తనకు చాలా ఇష్టం. ఒకటి రేసుగుర్రం సాంగ్.. ఇంకోటి చారుశీల సాంగ్. అలాంటిది సలార్ లో ఆమెతో ఎలాంటి డ్యూయెట్ లేదా ప్రభాస్ తో కలిసి ఒక సాంగ్ పెట్టలేదు.. నేను అప్సెట్ అయ్యానని రాజమౌళి సరదాగా అన్నారు. దానికి ప్రశాంత్ నీల్ ఆన్సర్ ఇస్తూ. సినిమాలో శృతి హాసన్ కూడా కథలో భాగమని అన్నారు. వరల్డ్ సినిమా తన పంథా మార్చుకుంది అందుకే ఈ సినిమాలో డ్యూయెట్ లేదని అన్నారు.
ఇక నిర్మాత విజయ్ గురించి ప్రశాంత్ నీల్ చెబుతూ.. సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారని అన్నారు. ప్రభాస్ కూడా నిర్మాత సపోర్ట్ సూపర్ అని.. ప్రశాంత్ ఏది అడిగితే అది చేశారని అన్నారు. ఆల్రెడీ కె.జి.ఎఫ్ 1, 2 ఆ తర్వాత కాంతారా ఇలా వరుస సక్సెస్ లతో ఉన్నాని అన్నారు.
సలార్ సినిమా అనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు దాన్ని మీరు ఎలా తీసుకున్నారని రాజమౌళి అడగ్గా.. అందుకే సోషల్ మీడియాకు తను గుడ్ బై చెప్పానని.. 1000 మంది మెచ్చుకుని ఒక్కరు విమర్శించినా అది హర్ట్ చేస్తుంది. అందుకే సినిమా అయ్యే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని అన్నారు ప్రశాంత్ నీల్.
డార్లింగ్ ఎక్స్ పెక్టేషన్స్ ప్రెజర్ ని ఎలా డీల్ చేశావ్ అని ప్రభాస్ ని అడిగారు రాజమౌళి. దానికి ఆన్సర్ ఇస్తూ ప్రశాంత్ నీల్ తో సినిమా చర్చలు ఎలా మొదలైంది. సలార్ ఎలా కుదిరింది అన్న దానికి వివరణ ఇచ్చారు. కాజువల్ గా మీట్ అయ్యాం అది కూడా వేరే నిర్మాత వల్ల. ఆ తర్వాత హోంబలే ప్రొడక్షన్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా అనగానే డేట్స్ అడ్జెస్ట్ చేసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని అన్నారు. ప్రశాంత్ నీల్ ఆఫర్ ని కాదంటే ఫ్యాన్స్ ఊరుకోరని సినిమా చేశానని అన్నారు ప్రభాస్.
అంతేకాదు కె.జి.ఎఫ్ తర్వాత అందరూ ప్రశాంత్ నీల్ తో చేయాలని అనుకున్నారు. అతను నాతో చేయాలని అనుకోవడం ఇదంతా బాహుబలి వల్లే అని రాజమౌళిని పొగిడారు ప్రభాస్. కె.జి.ఎఫ్ ప్రభాస్ చేసుంటే బాగుండేది అని చాలామంది అన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ కూడా నాతో అన్నారు. కె.జి.ఎఫ్ మీరు చేసుంటే బాగుండేది అని అందుకే ప్రశాంత్ తో సినిమా అనగానే డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోయినా నాగ్ అశ్విన్ కి సర్ది చెబుదామని సలార్ కి ఓకే చెప్పానని అన్నారు ప్రభాస్.
బాహుబలి ముందే రెండు పార్టులుగా అనుకున్నారా అని ప్రశాంత్ నీల్ రాజమౌళిని అడిగారు. కథగా ఉన్నప్పుడు బాహుబలి ఒక పార్ట్ గానే తీయాలని అనుకున్నాం కానీ పాత్రలు వాటి ఎమోషన్స్ ఇలా అన్ని సినిమా ఎక్కువ వస్తుంది. అయితే అప్పటికి అది కొత్త నిర్ణయం. బడ్జెట్ కూడ డబుల్ అవుతుంది. అందుకే కేవలం తెలుగు వరకు అయితే అమౌంట్ రాదని హిందీ, మలయాళ, తమిల్ రిలీజ్ చేశాం.
సలార్ కూడా రెండు పార్టులు ముందు అనుకున్నారా.. అనే ప్రశ్నకు సమాధానంగా ఇది కూడా ఒక సినిమానే చేద్దామని అనుకున్నాం కానీ డ్రామా బాగా వర్క్ అవుట్ అవుతుంది. దేవ, వరద రాజాలతో పాటుగా మరో ఐదు పాత్రల మధ్య డ్రామా బాగా వస్తుంది. సినిమా మధ్యలో రెండు పార్టులుగా చేద్దామని అనుకున్నామని అన్నారు ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ ప్రతి సీన్ లో ఆఖరికి హెయిర్ స్టైల్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారని అన్నారు పృధ్వి రాజ్. తనతో స్టోరీ డిస్కషన్ టైం లోనే ఆయన రూం లో ఒక పెద్ద బోర్డ్ మీద ఖాన్సారా చరిత్ర.. అక్కడ వారు వేసుకున్న దుస్తులు, హారాలు, పాత్రలు వాటి క్యారెక్టరైజేషన్ ఇదంతా ఉంది. అందుకే ఆయన అంత పెద్ద సినిమాలు చేస్తున్నారని అర్ధమైందని అన్నారు పృధ్విరాజ్.
10 ఏళ్ల నుంచి ఇతర భాషల సినిమాలు చేయలేదు. సలార్ ఆఫర్ రాగానే ఏదో ఒక చిన్న పాత్ర ఇస్తారని కాదని చెప్పాలని అనుకున్నా కానీ నేరేషన్ విన్న తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాను. మలయాళ పరిశ్రమ నుంచి ఎక్కువగా బయట సినిమాల్లో పెద్ద ఆఫర్ రావట్లేదు. సలార్ తర్వాత అది మారుతుందని అనుకుంటున్నానని అన్నారు పృధ్వి రాజ్.
సలార్ లో తన పాత్ర చెప్పాక ప్రభాస్ సార్ ఓకే అన్నారా అంటే ఆయనే ఈ పాత్రకు మీరు కరెక్ట్ అని చెప్పారని అన్నారు పృధ్విరాజ్. ట్రైలర్ లో డ్రామా కొద్దిగానే చూపించాం.. సినిమా లో ఎక్కువ ఉంటుంది. నా సినిమాలకు రవి బస్రూర్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు ఆయన బెస్ట్ ఇచ్చారని అన్నారు ప్రశాంత్ నీల్.
ప్రభాస్ సినిమా ఏదైనా ఫ్యామిలీ చూడటం అలవాటు. కానీ ఈసారి మా ఫ్యామిలీ బెంగుళూరులో ఉంది వాళ్లు ఇక్కడకు రావడమో లేదా నేను అక్కడకు వెళ్లడమో చేయాలి. ప్రస్తుతం దాని గురించే నేను ఆలోచిస్తున్నా సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నానని అన్నారు రాజమౌళి.