Begin typing your search above and press return to search.

మరోసారి UV లో శర్వా.. క్రేజీ టైటిల్

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   17 July 2024 7:32 AM GMT
మరోసారి UV లో శర్వా.. క్రేజీ టైటిల్
X

యంగ్ హీరో శర్వానంద్ రీసెంట్ గా మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ అయితే అందుకున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు.


ఇప్పటికే ఈ బ్యానర్ లో శర్వానంద్ రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం యూవీలో నాలుగో సినిమాగా కొత్త మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాతో అభిలాష్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. అందుకే రేస్ రాజా అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

శర్వానంద్ 36వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. మాళవిక నాయర్ ఈ మూవీలో శర్వానంద్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ చివరిగా అన్ని మంచి శకునములే సినిమాలో సంతోష్ శోభన్ కి జోడీగా నటించింది. కల్కి చిత్రంలో ఉత్తర క్యారెక్టర్ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. నటిగా మాళవిక నాయర్ కి మంచి గుర్తింపు ఉంది. శర్వానంద్, మాళవిక కాంబినేషన్ అనేసరికి ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉండదని భావిస్తున్నారు.

ఇక రేస్ రాజా ఫస్ట్ లుక్ పోస్టర్ ని శర్వానంద్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేయనున్నారంట. యూవీలో శర్వానంద్ నుంచి వచ్చిన మూడు సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా హిట్ గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఒకే ఒక జీవితం సినిమాతో శర్వానంద్ చివరిగా సక్సెస్ అందుకున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. మనమే ఎంటర్టైనర్ గా వచ్చింది.

రేస్ రాజాలో శర్వానంద్ ఎనర్జీ అండ్ ఫన్ ని మరోసారి ఆడియన్స్ ఆస్వాదించడం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది. యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతోంది. అలాగే అఖిల్ హీరోగా ధీర అనే చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.