Begin typing your search above and press return to search.

విడాకుల బాట‌లో పాపుల‌ర్ గాయ‌ని కం న‌టి?

ప్ర‌స్తుతం ఈ జంట ఎవ‌రిదారిలో వారు విడివిడిగా నివ‌సిస్తున్నారంటూ పాపుల‌ర్ ఆంగ్ల‌ మీడియాలో సంచ‌ల‌న‌ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

By:  Tupaki Desk   |   18 May 2024 11:30 PM GMT
విడాకుల బాట‌లో పాపుల‌ర్ గాయ‌ని కం న‌టి?
X

సెలబ్రిటీ ప్ర‌పంచంలో రోజుకో విడాకుల వార్త క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్పుడు అలాంటి మ‌రో వార్త దావాన‌లంలా మారింది. పాపుల‌ర్ గాయ‌ని కం న‌టి త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకోబోతోందని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ జంట ఎవ‌రిదారిలో వారు విడివిడిగా నివ‌సిస్తున్నారంటూ పాపుల‌ర్ ఆంగ్ల‌ మీడియాలో సంచ‌ల‌న‌ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ జంట మ‌రెవ‌రో కాదు.. జెన్నిఫర్ లోపెజ్ - బెన్ అఫ్లెక్.

అమెరిక‌న్ సింగర్, డ్యాన్స‌ర్, పాపుల‌ర్ న‌టి అయిన జెన్నిఫ‌ర్ లోపేజ్.. అమెరిక‌న్ న‌టుడు, ఫిలింమేక‌ర్

బెన్ అఫ్లెక్ జంటకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ ప్రేమ జంట స్వర్గంలో సమస్య త‌లెత్తింద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఈ జంట‌ వివాహ ఉంగరాలను తొల‌గించ‌కుండా క‌నిపించినా కానీ, క‌ల‌త‌ల‌తో బ్రేక‌ప్ బాట‌లో ఉన్నార‌ని ప్ర‌ముఖ ఆంగ్ల మీడియాలు క‌థ‌నాలు వెలువ‌రించాయి.

పాపుల‌ర్ TMZ ప్రకారం.. బెన్ అఫ్లెక్ లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్‌లోని ఇంట్లో న‌వ‌శిస్తున్న‌ట్లు ఫోటో ఒక‌టి వైర‌ల్ అయింది. బెవర్లీ హిల్స్‌లోని ఈ జంట నివ‌శించే ఇంట్లో అత‌డు ప్ర‌స్తుతం ఉండ‌డం లేదు. అతడు బ్రెంట్‌వుడ్ నివాసంలో రాత్రిపూట గ‌డిపిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. వారం రోజులుగా అత‌డు అక్కడే ఉంటున్నట్లు సోర్సెస్ చెబుతున్నాయి. దీనిని బ‌ట్టి ఈ జంట విడిపోనుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తూ, అఫ్లెక్ ముందు రోజు రాత్రి జెన్నిఫ‌ర్ లోపెజ్‌తో కనిపించలేదు. ఆమెకు దూరంగా బ్రెంట్‌వుడ్ ఇంటిలో అతడు త‌న‌ బసను ఖాయం చేసుకున్నాడు.

అగ్నికి ఆజ్యం పోస్తూ.. ఇటీవ‌ల‌ బహిరంగ ప్రదర్శనల సమయంలో బెన్ - జెన్ ఒకరికొకరు దూరంగా ఉండటం గమనార్హం. ఇటీవలి మెట్ గాలా 2024 ఈవెంట్ కి జెన్నిఫ‌ర్ లోపెజ్ సోలోగా హాజరయ్యారు. అత‌డు క‌నిపించ‌క‌పోయేస‌రికి చాలా సందేహాలు వ‌చ్చాయి.

అఫ్లెక్ -లోపెజ్ ఇటీవలి రోజుల్లో తమ వివాహ ఉంగరాలను ధరించి కనిపించారు. అఫ్లెక్ బ్రెంట్‌వుడ్ ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తన ఉంగరంతో కెమెరాకి చిక్కాడు. అదే విధంగా జెన్నిఫ‌ర్ లోపెజ్ త‌న ఇంటి వ‌ద్ద‌ ఆటలాడుతూ కనిపించింది. అయినా కానీ వారి మ‌ధ్య స‌రిగా లేద‌ని టిఎంజెడ్ క‌థనం పేర్కొంది. విడిపోయార‌నే పుకార్లపై జెన్నిఫర్ లోపెజ్ - బెన్ అఫ్లెక్ జంట‌ ఇంకా స్పందించలేదు.