Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో బాబి-2 క‌ష్టాలు ఇలా!

మ‌రి కెరీర్ ప్రారంభ ద‌శ‌లో హాట్ బ్యూటీ ప‌రిస్థితి ఏంటి? అంటే అంద‌రి భామ‌ల్లాగే తాను ఎదిగే క్ర‌మంలో చాలా క‌ష్ట‌న‌ష్టాలు ఓర్చిన‌ట్లు రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:30 PM GMT
బాలీవుడ్ లో బాబి-2 క‌ష్టాలు ఇలా!
X

బాబి-2గా ఫేమ‌స్ అయిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. అమ్మ‌డు 'యానిమ‌ల్` సినిమాతో ఏ రేంజ్లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే. తెర‌పై క‌నిపించినంత సేపు మెరుపులా మురిపించేసి వెళ్లిపోయింది. దీంతో అమ్మ‌డికి ఇప్పుడు అవ‌కాశాలు అలాగే వ‌రిస్తున్నాయి. బాలీవుడ్ తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ డిమ్రీకి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఇదంతా ఒకే. మ‌రి కెరీర్ ప్రారంభ ద‌శ‌లో హాట్ బ్యూటీ ప‌రిస్థితి ఏంటి? అంటే అంద‌రి భామ‌ల్లాగే తాను ఎదిగే క్ర‌మంలో చాలా క‌ష్ట‌న‌ష్టాలు ఓర్చిన‌ట్లు రివీల్ చేసింది.

'యానిమ‌ల్ `రిలీజ్ కి ముందు నాకు ప్రేక్ష‌కులు ప్రేమాభిమానాలు అందించింది ఓటీటీ ద్వారానే. అంతా న‌న్ను ఓటీటీలోనే ఎక్కువ‌గా చూసి ఉంటారు. ఆ వేదిక ఎంతో మంది న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పిం చింది. నేను సినిమాల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో చాలా త‌క్కువ అవ‌కాశాలుండేవి. రోజూ ఎంత మందిని క‌లిసినా ప‌నిలేద‌ని చెప్పేవారు. స‌రైన అవ‌కాశం కోసం ఆరు నెల‌లు ఆగాల్సి వ‌చ్చేది.

మ‌ళ్లీ క‌లిస్తే ఆ త‌ర్వాత ఆ ఛాన్స్ వ‌స్తుందా? లేదా? అన్న టెన్ష‌న్ ఉండేది. ఈ లోపే ఆ పాత్ర‌కి మ‌రొక‌ర్ని తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ ద్వారా చాలా మందికి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కొత్త వాళ్లు ప్ర‌తిభ నిరూపించుకోవ‌డానికి చ‌క్క‌ని వేదిక‌లా ఓటీటీ నిలిచింది. నేను ఎంత గొప్ప పాత్ర చేసినా ఓటీటీలో రిలీజ్ అయిందా? థియేట‌ర్ లో రిలీజ్ అయిందా ? అన్న‌ది ప‌ట్టించుకోను. నాకు రెండు స‌మాన‌మే` అంది.

ప్ర‌స్తుతం త్రిప్తి డిమ్రీ బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. వ‌రుస‌గా సినిమాలు క‌మిట్ అవుతుంది. మేరే మెహ‌బూబ్ మేరే స‌న‌మ్.. విక్కీ విద్యా కావో వాలా వీడియో సినిమాలు చేస్తుంది. అలాగే కొత్త అవకాశాలు బాగానే అందుకుంటుంది. ఇత‌ర భాష‌ల నుంచి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ త్రిప్తి డిమ్రీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదే బ్యూటీని సందీప్ యానిమ‌ల్ పార్క్ లోనూ రిపీట్ చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.