Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. థియేట్రికల్ టార్గెట్ ఎంత?

దిల్ రాజు నిర్మాణంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్

By:  Tupaki Desk   |   19 March 2024 3:45 AM GMT
ఫ్యామిలీ స్టార్.. థియేట్రికల్ టార్గెట్ ఎంత?
X

దిల్ రాజు నిర్మాణంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా బ్రాండ్ తో ఈ చిత్రాన్ని మిగతా భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గీతాగోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సినిమా తరహాలో రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రాన్ని పరశురామ్ రెడీ చేశారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా బిజినెస్ పైన ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ పెట్టారు. ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ డీల్స్ కు హై డిమాండ్ ఉండడంతో గట్టిగానే కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ చివరగా చేసిన లైగర్, ఖుషి సినిమాలు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ పరశురామ్, విజయ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన గీతాగోవిందం ప్రపంచ వ్యాప్తుగా 65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి ఈ చిత్రం మీద కూడా హైప్ ఉంది. భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్ కి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

ఈ బ్యూటీ సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. మృణాల్ ఠాకూర్ సినిమాలో ఉందంటే కచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్ లోకి వెళ్ళింది. ఇలా విజయ్, మృణాల్ ఫేమ్ ఫ్యామిలీ స్టార్ సినిమాకి అదనపు అస్సెట్ గా ఉంది. అందుకే కచ్చితంగా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా ఈ మూవీ ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారు.

ఈ కారణంగానే 50 కోట్ల రేంజ్ లో థీయాట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న కథలకి పాజిటివ్ రివ్యూలు వస్తేనే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి థియేటర్స్ లో చూస్తారు. లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చూస్తారు. మరి ఈ బిజినెస్ డిస్కషన్స్ ఎంతకి తెగుతుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాను అసలైతే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాలేదు. అనంతరం మార్చికి షిఫ్ట్ చేయగా అప్పటికి కూడా సినిమా సిద్ధం కాలేదు. ఇక ఫైనల్ గా దేవర తప్పుకోవడంతో ఏప్రిల్ 5 కి ఫిక్స్ చేశారు.