Begin typing your search above and press return to search.

ఊర మాస్ ఆడియన్స్ కూడా వావ్ అనేలా..!

ఈ సినిమాలో ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు ఉంటాయా అని డౌట్ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 3:30 PM GMT
ఊర మాస్ ఆడియన్స్ కూడా వావ్ అనేలా..!
X

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సినిమా తో వస్తున్నాడు. మరో 10 రోజుల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ పెట్టారని తెలిసిందే. ప్రచార చిత్రాలన్నీ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పరుస్తుండగా ప్రభాస్ ఊర మాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఆలోచనలో పడ్డారు. కల్కి సినిమా హై టెక్నికల్ వ్యాల్యూస్ తో అడ్వాన్స్డ్ మూవీగా వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు ఉంటాయా అని డౌట్ పడుతున్నారు. ఐతే మేకర్స్ మాత్రం అలాంటి డౌట్లు పెట్టుకోనక్కర్లేదని అంటున్నారు.

ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ కూడా ఇష్టపడే భారీ యాక్షన్ సీన్స్ కల్కిలో ఉంచాడు నాగ్ అశ్విన్. ఊర మాస్ ఆడియన్స్ కూడా విజిల్స్ వేసేలా స్టోరీ టెల్లింగ్ ఉంటుందని. కచ్చితంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎవరు కూడా కల్కి చూసి డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. రెబల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి వారెవా అనేస్తారని అంటున్నారు.

ప్రభాస్ కల్కి సినిమా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రికార్డులను కొల్లగొట్టేలా ఉంది. సినిమాలో వాడిన మోడ్రన్ కారు బుజ్జిని పరిచయం చేసినప్పటి నుంచి సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈమధ్యనే వచ్చిన ట్రైలర్ ఐతే సినిమా పురాణాలను టచ్ చేస్తూ ఒక అద్భుతాన్నే సృష్టించేలా ఉందని ఫిక్స్ అయ్యారు.

నాగ్ అశ్విన్ విజన్ అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుంది అన్నది ఊహించడం కూడా కష్టమనిపించేలా ఉంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్ ఈ కల్కితో పాన్ వరల్డ్ లో షేక్ చేసే పరిస్థితి కనబడుతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ స్టార్స్ తో పాటుగా దీపిక దిశా పటాని లాంటి గ్లామర్ హీరోయిన్స్ ఉన్న కల్కి సినిమా విజువల్ వండర్ గా అద్భుతాలు క్రియేట్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఐతే వాటి రేంజ్ ఏంటన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే కల్కి రిలీజ్ నాడు ఒక రేంజ్ లో హంగామా కనిపించబోతుందని చెప్పొచ్చు. కల్కి సినిమా ఫస్ట్ డే వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.