Begin typing your search above and press return to search.

బీచ్‌ని మ‌రిగించిన ఒంపుసొంపుల ఖిల్లా

ఇదిగో ఇప్పుడు అదే కేట‌గిరీకి చెందిన త‌మిళ‌న‌టి దివ్య‌భార‌తి తాజా బీచ్ ఫెస్టివ‌ల్ ట్రీట్ యూత్ ని వేడెక్కిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 5:30 PM GMT
బీచ్‌ని మ‌రిగించిన ఒంపుసొంపుల ఖిల్లా
X

అందాన్ని కొల‌వ‌డానికి కొల‌త‌లు కీల‌కం. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లేదా పూల్ సైడ్ ట్రీట్ అయినా.. జిమ్ యోగా సెష‌న్స్ లో టైట్ ఫిట్ లుక్ కోసం అయినా కొన్ని కొల‌త‌లు ప్ర‌మాణాలు అవ‌స‌రం. అలాంటి కొల‌త‌లు ఉన్న భామ‌లు రంగుల ప్ర‌పంచంలో ఏల్తారు. అందం ప్లస్ కొల‌త‌లు చాలా మందికి పెద్ద అస్సెట్ అవుతాయి. ఒక్కోసారి అందాన్ని కొల‌త‌లు డామినేట్ చేస్తాయి. ఫోటోజెనిక్ రూపం చాలాసార్లు వెబ్ లో పాపుల‌ర‌వుతుంది.


ఇదిగో ఇప్పుడు అదే కేట‌గిరీకి చెందిన త‌మిళ‌న‌టి దివ్య‌భార‌తి తాజా బీచ్ ఫెస్టివ‌ల్ ట్రీట్ యూత్ ని వేడెక్కిస్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు కం హీరో జీవీ ప్రకాష్ స‌ర‌స‌న `బ్యాచిలర్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన ఈ బ్యూటీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. బీచ్ ప‌రిస‌రాల్లో ఒంపుసొంపుల‌ను ఆవిష్క‌రించే ఫోటోల‌ను దివ్య సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అవి అంత‌ర్జాలాన్ని షేక్ చేసాయి.


సింపుల్ లుక్ లో ఒంపుసొంపుల్ని ఎలివేట్ చేసిన తీరు ఆక‌ర్షిస్తోంది. ఊదా రంగు ష‌ర్ట్ ధరించి తీరం వెంబడి షికారు చేస్తున్న ఈ బ్యూటీ షైనీ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ బ్యూటీ బీచ్ ని మ‌రిగించిందంటే అతిశ‌యోక్తి కాదు. దివ్య‌భార‌తి వేడెక్కించే అందమైన భంగిమలు కెమెరాలో బంధించిన‌ చిక్కిన వైనాన్ని ప్ర‌శంసించాల్సిందే. దివ్య ప్ర‌స్తుతం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఓ వెలుగు వెల‌గాల‌ని క‌ల‌లుగంటోంది. అయితే ఇక్క‌డ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల దృష్టి అటువైపు ప‌డుతుందేమో చూడాలి. నేటిత‌రం యువ‌హీరోల‌తో అవ‌కాశాలు ద‌క్కించుకుంటుందేమో చూడాలి.