Begin typing your search above and press return to search.

హీరో సాహ‌సాలే ఓ సంచ‌ల‌నంలా ఉన్నాయే!

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటిసినిమా పాన్ ఇంయాలో సంచ‌ల‌న‌మ‌వ్వ‌డంతో అలాంటి ప్ర‌య‌త్నాలు మ‌న‌మెందుకు చేయ‌డం లేద‌ని లోతుగా ఆలోచించే గ్రేట్ యాక్ట‌ర్ కం డైరెక్ట‌ర్.

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:30 AM GMT
హీరో సాహ‌సాలే ఓ సంచ‌ల‌నంలా ఉన్నాయే!
X

మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ వెండితెర సాహ‌సాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వైవిథ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన ముద్ర వేసిన న‌టుడాయ‌న. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటిసినిమా పాన్ ఇంయాలో సంచ‌ల‌న‌మ‌వ్వ‌డంతో అలాంటి ప్ర‌య‌త్నాలు మ‌న‌మెందుకు చేయ‌డం లేద‌ని లోతుగా ఆలోచించే గ్రేట్ యాక్ట‌ర్ కం డైరెక్ట‌ర్. అందుకే ఇప్పుడు `ఆడు జీవితం` అంటూ పాన్ ఇండియా వైడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. మ‌ల‌యాళం..ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన వండ‌ర్స్ క్రియేట్ చేసింది.

ట్రైల‌ర్ లోనే పృథ్వీరాజ్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ట్రైల‌ర్ మెచ్చ‌ని ప్రేక్షకుడు లేడు. ఇప్పటికే అవార్డు కోసం ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ ట్రైలర్ ను కూడా పంపించారు. జాతీయ అవార్డు గ్రహీత ఫిల్మ్ మేకర్ బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. బెన్యామిన్ రచించిన 'ఆడు జీవితం' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పొట్టకూటి కోసం ఏజెంట్లను నమ్మి సౌదీకి అరేబియాకు వలస వెళ్లి.. అక్కడ ఎడారిలో మేకల కాపరిగా తన పని చేయాల్సి వస్తుంది. అది ఇష్టంలేకపోయినా ఇంటికి వెళ్లలేక బలంవంతగా జీవితాన్ని వెళ్లదీస్తుం టాడు.

కథ పక్కన పెడితే.. వలస కూలీగా, బానిసగా పృథ్వీరాజ్ తన లుక్ మార్చుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పృథ్వీని ఈసినిమాలోని క్యారెక్టర్ కు చాలా బాగా సెట్ అయ్యాడు. ఎవరైనా సడెన్ గా చూస్తే అతడు పృథ్వీ అంటే కూడా నమ్మలేరు. ఆ రేంజ్ లో పృథ్వీ పాత్ర‌ని డిజైన్ చేసారు. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన మ‌రిన్ని విశేషాల్ని పృథ్వీ పంచుకున్నారు. `2008లో దర్శకుడు బ్లెస్సీ- నేనూ ఈ ప్రాజెక్ట్ ఒకేచేసాం. అప్పటికే మలయాళ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు బ్లెస్సీ ఒక‌రు.అప్పుడే అత‌డు ఆడుజీవితం చేయాలని ప‌ట్టుబ‌ట్టారు.

అలా అప్పుడ‌నుకున్న క‌థ తెర‌పైకి వెళ్ల‌డానికి ప‌దేళ్లు ప‌ట్టింది. 2018లో మేము షూటింగ్ ప్రారంభించాం. మొదటి రోజు షూటింగ్‌లో బ్లెస్సీ న‌న్ను ఎంతో ఆప్యాయంగా హ త్తుకుని పది నిమిషాలు క‌న్నీళ్లు చెమ‌ర్చారు. ఆ సంఘ‌ట‌న ఇప్ప‌టికీ బాగా గుర్తుంది. అప్ప‌టికే నా సొంత సినిమాల‌తో నేను బిజీగా ఉన్నా ఆ సినిమాకి స‌మ‌యం కేటాయించాను. అందుకే ఆయ‌న ఎంతో సంతోషించారు. మొదట రాజస్థాన్‌లో షూటింగ్ చేయాల‌నుకున్నాం. దీనిలో భాగంగా విదేశాల నుంచి పశువులు అక్క‌డికి తీసుకురావాల‌ని అనుకున్నాం.

కానీ కొన్ని కారణాల వల్ల పశుసంవర్ధక శాఖ మాకు అనుమ‌తివ్వ‌లేదు. దీంతో మేము మా షూటింగ్‌ని జోర్డాన్‌కు మార్చవలసి వచ్చింది. పాత్ర కోసం 30 కిలోల బరువు తగ్గవలసి వచ్చింది. ఆస‌మ‌యంలో బాగా ఆక‌లిని భరించాల్సి వ‌చ్చింది. బాగా బ‌క్క‌చిక్కాను. 45 రోజుల పాటు అలాగే ఉండాల్సి వ‌చ్చింది. అప్పుడే కోవిడ్ కూడా మొద‌లైంది. దీంతో షూటింగ్ అగిపోయింది. ఏడాదిన్న‌ర బ్రేక్ ఇచ్చాం. దానికి కొన‌సాగింపు చేయాలి కాబ‌ట్టి మ‌ళ్లీ నేను బ‌రువు త‌గ్గాల్సి వ‌చ్చింది. చివ‌రికి ఎలాగూ షూటింగ్ పూర్తి చేయ‌గ‌లిగాం` అని అన్నారు.