చెల్లిగా ఫీలై హీరోయిన్ ఛాన్స్ ఇవ్వని హీరో!
చెల్లిగా మెప్పించిన హీరోయిన్ ఒక్కసారిగా మరుసటి సినిమాకి వచ్చేసరికి పూర్తిగా ట్రాన్స పర్మేషన్ అయిపోతుంది.
By: Tupaki Desk | 25 Feb 2024 2:30 AM GMTఇప్పుడు హీరోయిన్లే హీరోలకు చెల్లెళ్లు అయిపోతున్నారు. అదే హీరోయిన్ అదే హీరోతో మరో సినిమాలో రొమాన్స్ చేస్తుంది. చెల్లిగా మెప్పించిన హీరోయిన్ ఒక్కసారిగా మరుసటి సినిమాకి వచ్చేసరికి పూర్తిగా ట్రాన్స పర్మేషన్ అయిపోతుంది. ట్రెండ్ మారింది కాబట్టి..ఆ ట్రెండ్ అనుగుణంగా జర్నీని ప్లాన్ చేసుకుని ముందు కు వెళ్తున్నారంతా. కానీ పాత రోజుల్లో సన్నివేశం అందుకు కాస్త భిన్నంగానే ఉండేది.
చెల్లి పాత్రలు పోషించారంటే? అదే హీరోతో హీరోయిన్ గా నటించాలంటే అంత ఈజీగా కుదిరేది కాదు. డైరెక్టర్లు హీరోయిన్లు సిద్దంగా ఉన్నా హీరో మాత్రం అంత ఈజీగా ఒప్పుకునేవారు కాదు. చెల్లి గా నటించిన నటి హీరోయిన్ అంటే చాలా మంది హీరోలు ఒప్పుకునేవారు కాదు. అలాంటి హీరోల్లో కెప్టెన్ విజయ్ కాంత్ కూడా ఒకరు. తాజాగా సీనియర్ నటి ఊర్వశి విజయ్ కాంత్ తో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.
`నేను చిన్నప్పుడు విజయ్ కాంత్ సినిమాల్లో నటించాను. ఆయనకు చెల్లి పాత్రలు కూడా పోషించాను. అప్పుడాయన నన్ను తంగాచ్చి అని పిలిచేవారు. తంగాచ్చి అంటే చెల్లి అని అర్దం. ఆ తర్వాత కొన్నాళ్లకి హీరోయిన్ గా ప్రమోట్ అయ్యాను. అలా ఓసినిమా కోసం విజయ్ కాంత్ సినిమాలో నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆయనతో ఛాన్స్ అంటే చాలా సంతోషించాను. కానీ నాతో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు.
నా పక్కన నటించేందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడలేదు. చెల్లి అని పిలిచాక ఆమెతో నేను ఎలా నటించగలను? అని అన్నారు. అదే సినిమాలో హీరో-హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిలో తప్పకుండా నటించాల్సిందేనని కండీషన్ కూడా ఉంది. దీంతో విజయ్ కాంత్ నాతో నటించడానికి ఒప్పుకోలేదు` అని అన్నారు.