మళ్లీ పెళ్లి ప్రకటన చేసిన హీరోయిన్
అంతే కాకుండా మగ బిడ్డకు కూడా అతని ద్వారా జన్మనిచ్చిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 30 Jan 2024 6:23 AM GMTకోలీవుడ్ తో పాటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో పలు సినిమాలు చేయడం ద్వారా ఇండియన్ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన అమీ జాక్సన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో జార్జ్ పనాయోటౌతో ప్రేమలో పడ్డట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా మగ బిడ్డకు కూడా అతని ద్వారా జన్మనిచ్చిన విషయం తెల్సిందే.
కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా జార్జ్ మరియు అమీ జాక్సన్ విడి పోయారు. వారి నిశ్చితార్థంను బ్రేక్ చేసుకున్నారు. ఇన్నాళ్లు సింగిల్ గానే గడిపిన అమీ జాక్సన్ కొత్త జీవితమును ఆరంభించేందుకు సిద్ధం అయ్యింది. నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించడంతో పాటు నిశ్చితార్థం అయినట్లుగా కూడా ఆమె ఫోటోల ద్వారా ప్రకటించింది.
ఎడ్ వెస్ట్‌విక్ తో అమీ జాక్సన్ వివాహ నిశ్చితార్థం అందమైన పర్వతాల మధ్య జరిగింది. ఆ ఫోటోలు కన్నుల విందు చేస్తున్నాయి. వీరిద్దరి జోడీ చాలా బాగుందని భవిష్యత్తులో వీరిద్దరు కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారనే నమ్మకం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటీష్ ముద్దుగుమ్మ అయిన అమీ జాక్సన్ ఇండియన్ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత కొన్నాళ్లుగా బిడ్డకు జన్మనివ్వడం వల్ల సినిమాలకు దూరంగా ఉన్న అమీ జాక్సన్ మళ్లీ సినిమాలతో బిజీ అవ్వబోతుంది. హీరోయిన్ గా హిందీతో పాటు ఇంగ్లీష్ లోనూ అమీ జాక్సన్ సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ఆమె నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.