Begin typing your search above and press return to search.

జైలు మారేప్పుడు ఎన్‌కౌంట‌ర్‌లో పోతాన‌ని భ‌య‌ప‌డ్డ హీరో

వేరే జైలుకు పంపేప్పుడు సంజయ్ ద‌త్ మతిస్థిమితం గురించి కూడా స‌ద‌రు అధికారి తన పుస్తకంలో రాసారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 12:30 AM GMT
జైలు మారేప్పుడు ఎన్‌కౌంట‌ర్‌లో పోతాన‌ని భ‌య‌ప‌డ్డ హీరో
X

1993 ముంబై పేలుళ్ల సమయంలో అక్రమంగా తుపాకులు కలిగి ఉన్నందుకు దోషిగా తేలిన నటుడు సంజయ్ దత్ వ్య‌వ‌హారం గురించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. మ‌హిళా అధికారి బోర్వాంకర్ గతంలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జైళ్లు)గా పనిచేసిన సమయంలో ఘ‌ట‌న‌ల‌ గురించి వెల్ల‌డించారు. ద‌త్ జైలు లోపల ఉన్నప్పుడు అతడికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇచ్చార‌నే వాదనలను ఆమె తోసిపుచ్చారు. అత‌డు క్ర‌మ‌శిక్ష‌ణ మీరితే ఫర్‌లాఫ్ అండ్ పెరోల్ తిరస్కరణకు దారితీసే ప్ర‌వ‌ర్త‌న అవుతుందని అన్నారు. వేరే జైలుకు పంపేప్పుడు సంజయ్ ద‌త్ మతిస్థిమితం గురించి కూడా స‌ద‌రు అధికారి తన పుస్తకంలో రాసారు.

ప్రముఖ వీడియో జాకీ సైరస్ బ్రోచాతో ఒక ఇంటర్వ్యూలో ``సంజయ్ దత్ చాలా మంచి ఖైదీనా?`` అని స‌ద‌రు అధికారిని అడిగారు. దానికి మాజీ IPS అధికారి సమాధానమిస్తూ, ``నేను పంజాబ్ కు చెందిన అధికారిని అని తెలుసుకోవడానికి అతడు తన సోర్స్ ను ఉపయోగించాడు. నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు. అయితే ప్రధాన విషయం ఏమిటంటే, మేము అతడికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని మీడియా ఆరోపించింది. నిజానికి మేం అలా చేయలేదు. అతడు సాధారణంగా మంచివాడు. ఎందుకంటే అతని పెరోల్ అండ్ ఫర్‌లాఫ్ జైలులో అతని ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. స‌రిగా ప్రవర్తించకపోతే, మేము అతనిని ఫర్‌లౌ లేదా పెరోల్‌కు అనుమతించము. కామ్ భీ కర్తా థా, బీడీ ఔర్ సిగరెట్ భీ ఖరీద్ లేతా థా. మొత్తంగా అతడు జైల్లో ఉన్న‌ప్పుడు బాగా ప్రవర్తించాడని గ్ర‌హించిన‌ట్టు తెలిపారు.

జైలులో మున్నా భాయ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో కలిసి సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయడంలో అతడు (సంజయ్ ద‌త్ ) సహాయం చేశాడా? అని అడిగినప్పుడు ``మేము ఉమంగ్ వంటి సంక్షేమ అంశం ఉన్న షోని ప్లాన్ చేస్తున్నాం. దాని కోసం అతడు మ‌మ్మ‌ల్ని సంప్రదించాడు... ప్రదర్శన బాగుంది.. కానీ మేము దానిని ప్ర‌ద‌ర్శించ‌లేకపోయాము`` అని తెలిపారు.

సంజ‌య్ ద‌త్ కి జైలులో ఇంటి ఆహారం తీసుకోవడానికి స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పైనా బోర్వాంకర్ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ, ``ఇది వివాదం కాదు.. ఇది వాస్తవం.. పెద్ద రాజకీయ నాయకులు.. బాలీవుడ్ హీరోలు.. హీరోయిన్లు జైలుకు వచ్చినప్పుడు వీఐపీలుగా భావిస్తారు. వారికి చట్టం గురించి జ్ఞానం తక్కువగా ఉంటుంది. సంజయ్ దత్ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నప్పుడు అండర్ ట్రయల్ ఖైదీ. అతడికి ఇంటి ఆహారం అనుమతించాం. ఒకసారి మేము అతడిని ఎరవాడ జైలుకు మార్చాము. అతడి నేరారోపణ తర్వాత, అండర్ ట్రయల్ లో చట్టపరమైన దోషిగా మారుతాడు. అప్పుడు అలాంటివి కుద‌ర‌వు అని తెలిపారు.

ఆర్థర్ రోడ్ జైలు నుండి పూణేలోని ఎరవాడ జైలుకు దత్ షెడ్యూల్ మారడం అతడిని తీవ్ర భయాందోళనకు గురి చేసింద‌ని కూడా మాజీ అధికారి తన పుస్తకంలో వివరించారు. అతడు ఎన్‌కౌంటర్‌లో హత్యకు గుర‌వుతాన‌ని భావించినందున భ‌య‌ప‌డ్డాడని తెలిపారు. ఆమె మాట్లాడుతూ ``దారిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోతానని దత్ భయపడ్డాడు! అతడి భయం చాలా వాస్తవమైనది. అతడికి చెమటలు పట్టడం మొద‌లైంది. జ్వరం ఉందని ఫిర్యాదు చేశాడు. ఇంతలో అతడు ఆర్థర్ రోడ్ జైలు నుండి బయటకు వెళ్లినట్లు వార్తలు లీక్ అయ్యాయి. జైలు గేట్ల వెలుపల పెద్ద సంఖ్యలో ప్ర‌జ‌లు గుమిగూడడం ప్రారంభమైంది... అని తెలిపారు. బోర్వాంకర్ ఇంకా చాలా విష‌యాల‌ను మాట్లాడుతూ-``మేము అత‌డి బదిలీని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. అప్ప‌టికి మోహరించిన బృందాన్ని ఉపసంహరించుకున్నాం. దత్ ఎరవాడకు మారడాన్ని ఒక సమస్యగా మార్చకుండా సలహా అందింది. ఎన్‌కౌంటర్ ఆలోచ‌న‌ల‌తో మ‌మ్మ‌ల్ని తప్పుగా భావించడం అతడిని ప్రభావితం చేసింది. కొంతకాలం తర్వాత మేము అతడిని నిశ్శబ్దంగా - విజయవంతంగా వేరొక జైలుకు తరలించగలిగాము. జ్యుడీషియల్ కస్టడీ అనే తెలివైన‌ పనిని బహిరంగ ప్రహసనంగా మారకుండా నిరోధించాము`` అని త‌న పుస్త‌కంలో బోర్వా రాసారు. రణ్‌బీర్ కపూర్ ప్ర‌ధాన పాత్ర‌లో సంజయ్ దత్ బయోపిక్ 2018లో రాజ్‌కుమార్ హిరాణీ తెర‌కెక్కి విడుద‌లైంది. సంజు పేరుతో వచ్చిన ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది.