Begin typing your search above and press return to search.

నాగి అలా.. భైరవ ఇలా.. పవర్ ఫుల్ ఫ్రేమ్

మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన కల్కిలో ప్రభాస్.. మరోసారి తన మార్క్ ను చూపించారు.

By:  Tupaki Desk   |   11 July 2024 12:00 PM GMT
నాగి అలా.. భైరవ ఇలా.. పవర్ ఫుల్ ఫ్రేమ్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.900 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రూ.1000 కోట్ల దిశగా వెళుతోంది. 15 రోజులుగా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతూ సత్తా చాటుతోంది.

మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన కల్కిలో ప్రభాస్.. మరోసారి తన మార్క్ ను చూపించారు. యాక్షన్ తో అదరగొట్టేశారు. త‌న క‌టౌట్‌ కు త‌గ్గ పాత్ర‌లో ఒదిగిపోయారు. భైరవ, కర్ణుడిగా అలరించారు. అమితాబ్ బచ్చన్ తో ఫైట్ సీన్స్ లో ఓ రేంజ్ లో నటించారు. అమితాబ్, ప్రభాస్ మధ్య ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ కు మంచి అప్లాజ్ వస్తోంది. దీంతో ప్రభాస్ పై ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులతోపాటు వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు.

అయితే తాజాగా కల్కి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బీటీఎస్ (Behind The Scenes) స్టిల్ ను రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ ఓ యాక్షన్ సీన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించారు. పిక్ లో ప్రభాస్ తోపాటు నాగ్ అశ్విన్ కూడా ఉన్నారు. ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్పెషల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. వేరే లెవల్ లో పిక్ ఉందని చెబుతున్నారు. పవర్ ఫుల్ ఫోటో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక రిలీజ్ అయిన అన్ని సెంటర్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న కల్కి.. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.167.07 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రూ. 19.45 కోట్లు, కర్ణాటకలో రూ. 30.60 కోట్లు, కేరళలో రూ. 10.30 కోట్లు, నార్త్ లో రూ. 117.75 కోట్లు, ఓవర్సీస్‌ లో రూ. 111.15 కోట్లు షేర్ రాబట్టినట్లు సమాచారం. అలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 456.32 కోట్లు షేర్, రూ. 940 కోట్లు గ్రాస్ వచ్చినట్లు టాక్.

రూ.600 కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్న బెన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. డైరెక్టర్లు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. మరి కల్కి మూవీ.. ఫుల్ థియేట్రికల్ రన్ టైమ్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.