Begin typing your search above and press return to search.

పోలీసు పాపతో నాని.. అలా క్యూట్ గా..

వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నాని నటిస్తున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సినీ ప్రియులతోపాటు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 July 2024 1:01 PM GMT
పోలీసు పాపతో నాని.. అలా క్యూట్ గా..
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గ్యాంగ్ లీడర్ ఫేమ్, టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నాని నటిస్తున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సినీ ప్రియులతోపాటు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.


అయితే సరిపోదా శనివారం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్.. పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఏదో ఒక అప్డేట్ తో సందడి చేస్తున్నారు. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల 50 రోజుల్లో ఒక శనివారం ముందు.. థియేటర్లలో మాస్ వైభవానికి నాంది పలుకుదామని గ్లింప్స్ ను షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్ ను పరిచయం చేశారు. నేడు హీరో హీరోయిన్లు కొత్త స్టిల్స్ ను షేర్ చేశారు.

ఆఫీస్ లో నాని.. డ్యూటీలో ప్రియాంక ఉన్న పిక్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు హీరో హీరోయిన్లకు సంబంధించిన మరో పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షం పడుతుండగా నాని, ప్రియాంక.. మెట్లపై కూర్చుని ఉన్నారు. నాని వెదురు గొడుగు వేయగా.. ఇద్దరు క్యూట్ గా నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా చూపించారు. దీంతో ఆడియన్స్ ను కొత్త పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

అయితే కొత్త పోస్టర్ తో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఉల్లాసం సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. జులై 13వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి గరం గరం సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలైన ఆ పాట.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఉల్లాసం సాంగ్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుందని టాక్.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్యతో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు కాకుండా.. మిగతా భాషల్లో Suryas Saturday టైటిల్‌ తో విడుదలవ్వనుంది. మరి ఈ మూవీతో నాని ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.