'డంకీ'ని దూరం పెట్టిన మరాఠా మందిర్!
కింగ్ ఖాన్ షారూఖ్ అంటే మరాఠా మందిర్ కి సెంటిమెంట్ అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 22 Dec 2023 4:36 AM GMTకింగ్ ఖాన్ షారూఖ్ నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే కొన్ని సంవత్సరాలుగా మరాఠా మందిర్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ డీడీఎల్‌జే చిత్రాన్ని ఈ థియేటర్ లో ఆడిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ అంటే మరాఠా మందిర్ కి సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు డంకీ మరాఠా మందిర్ లో ఆడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ మరాఠా మందిర్ లో షారూఖ్ నటించిన డంకీ విడుదల కాలేదు. అంతేకాదు.. డంకీ పంపిణీదారులపై మరాఠా మందిర్ యజమాని చాలా సీరియస్ గా ఉన్నారు.
అయితే డంకీ రిలీజ్ కి సంబంధించి షో షేరింగుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, దానిని క్లియర్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారని జి 7 మల్టీప్లెక్స్ - మరాఠా మందిర్ సినిమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ చాలా కలత చెందారు.
థియేటర్ల షేరింగ్ లో కొన్ని సమస్యల వల్ల అనేక సింగిల్ స్క్రీన్లు ప్రస్తుతం బుకింగ్‌లు తెరవలేకపోతున్నాయి అంటూ మూడు రోజుల క్రితం జి 7 మల్టీప్లెక్స్ - మరాఠా మందిర్ సినిమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ చాలా కలత చెందారు. చివరి మూడు రోజుల్లో బుకింగులు తెరవలేకపోయామని ఆందోళన చెందారు. సలార్, డంకీ మధ్య థియేటర్ల షేరింగుకి సంబంధించిన సమస్యను ఆయన హైలైట్ చేసారు.
కానీ చివరికి మరాఠా మందిర్ లో కేవలం సలార్ మాత్రమే ఆడుతోంది. డంకీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దానిబదులు ఒక ఆటగా ఇంకా `దిల్ వాలే దుల్హానియా లేజేయేంగే`ని ఆడిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ పోర్టల్ తో డంకి- సాలార్ గురించి తన ఆలోచనలను దేశాయ్ షేర్ చేసారు. ``మాకు బుకింగ్స్ తెరవడానికి అనుమతి లేదు. మా థియేటర్లు మాత్రమే కాదు, అన్ని సింగిల్ స్క్రీన్‌లు బుకింగ్‌లను ఆపేసారు. చాలా మల్టీప్లెక్స్‌లలో, గురువారం కోసం టికెట్ బుకింగ్ మాత్రమే అనుమతించారు. అంతే... డంకి గురువారం విడుదల అవుతోంది. ఈ వ్యక్తులు (పంపిణీదారులు) సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా లేరు. వారు గరిష్ట ఆదాయం దొరికే మల్టీప్లెక్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. అదే సమయంలో సింగిల్ స్క్రీన్లను పట్టించుకోలేదు. మేము బాధితులుగా మిగిలాము. నా భాషను క్షమించండి.. కానీ ప్రతిసారీ, ఘర్షణ ఉంది. మాకు f **** d. మేం ఏం చెయ్యాలి?`` అని ఆవేదన వ్యక్తం చేసారు.
ఏడు థియేటర్లను కలిగి ఉన్న జి 7 మల్టీప్లెక్స్, మరాఠా మందిర్ స్క్రీన్లను మనోజ్ దేశాయ్ నిర్వహిస్తున్నారు. 1000-సీట్ల గైటీలో గురువారం డంకి కోసం బుకింగ్‌లను ప్రారంభించినా...మరాఠా మందిర్ లో బుకింగులు తెరవలేదు. ఇటీవల షారుఖ్ ఖాన్ అభిమానులు డంకి కోసం 5:55 AM ప్రదర్శనను గైటీలో 5:55 AM ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుండి బుకింగ్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సింగిల్-స్క్రీన్ మరాఠా మందిర్ బుకింగ్‌లు గురువారం కూడా ప్రారంభించలేదు. దీనిపైన థియేటర్ యజమాని దేశాయ్ చాలా సీరియస్ అయ్యారు. ``కేవలం మూడు రోజుల్లో విడుదల కానున్న సినిమాకి ఇంకా బుకింగులే మొదలవ్వకపోవడంపై కోపంగా ఉన్నాం. ఇక మేము దాని ప్రయోజనాన్ని పొందలేము. టిక్కెట్లను అమ్మలేము. వారు ఈ చిత్రాన్ని(డంకీని) నాశనం చేస్తున్నారు. కోయి షారూఖ్ ఖాన్ కో బోలే యే బాట్ వారు తన చిత్రంతో ఎఫ్ **** జి అని వ్యాఖ్యానించారు. సింగిల్ స్క్రీన్ల షేరింగులో సమస్య పరిష్కారం కాకపోవడం వల్లనే డంకీ విడుదల కాలేదు. కానీ ప్రస్తుతం సలార్ మరాఠా మందిర్ లో ఆడుతోంది. మొదటి ఆటను డిడిఎల్ జే కోసం కేటాయించగా, మిగతా మూడు షోలను సలార్ కోసం కేటాయించడం ఆసక్తికరం.