Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వంతో చేసిన త‌ప్పు మ‌ళ్లీ చేయ‌డం లేదు!

అతడు బంప‌ర్ మెజారిటీతో గెల‌వ‌డ‌మే గాక, జ‌వ‌జీవాలు లేని కాంగ్రెస్ ని విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌డంలో స‌క్సెస‌యినందుకు జాతీయ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:35 PM GMT
ఏపీ ప్ర‌భుత్వంతో చేసిన త‌ప్పు మ‌ళ్లీ చేయ‌డం లేదు!
X

తెలంగాణలో 2023 సాధార‌ణ‌ ఎన్నికల ఫ‌లితం సంచ‌ల‌నంగా మారింది. నిన్ననే ఫలితాలు వెలువడ్డాయి. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని కొత్త ప్రభుత్వంగా ఎన్నుకున్నారు. తెలంగాణా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అతడు బంప‌ర్ మెజారిటీతో గెల‌వ‌డ‌మే గాక, జ‌వ‌జీవాలు లేని కాంగ్రెస్ ని విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌డంలో స‌క్సెస‌యినందుకు జాతీయ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. ఇప్పుడు రేవంత్ ని సినీసెల‌బ్రిటీలు ప్ర‌శంసించారు. టాలీవుడ్ నిర్మాతలు రేవంత్ రెడ్డిని నేరుగా క‌లిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు సినిమా పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని, ఈ ప్రభుత్వం కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. త్వరలో సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ సీనియర్ నేతలను కలుస్తాం! అని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ అన్నారు.

టాలీవుడ్ నిర్మాతలు గతంలో ఏపీ ప్రభుత్వంతో చేసిన తప్పును మళ్లీ చేయడం లేదు. గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు అభినందనలు తెలిపారు. ఈరోజు రేవంత్ రెడ్డిని టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు కలిశారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రేవంత్‌కి ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి కలిసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. నిర్మాత ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రో వైపు తెలుగు నిర్మాత‌ల మండ‌లి అధికారికంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపింది. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల‌ని కోరింది. నిర్మాత‌ల మండ‌లిలో 2870 మంది నిర్మాత‌లు ఉన్నార‌ని కూడా కౌన్సిల్ వెల్లడించింది. వారి సంక్షేమం కోసం ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ట్టు కూడా వెల్ల‌డించింది.

తెలంగాణ ఎన్నికలు - 2023:

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. దేశం మొత్తం కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తుండ‌గా, తెలంగాణ‌లో రేవంత్ విజ‌యం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. కేసీఆర్‌కు మూడోసారి సీఎం పదవి వస్తుందని, బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారాన్ని నిలుపుకుంటుందని చాలా మంది భావించినప్పటికీ, భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణో అందరినీ ఆశ్చర్యపరిచి ఎన్నికల్లో విజయం సాధించింది.