Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్ లు ఇవే

అయితే డిజిటల్ స్పేస్ పెరిగిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఎక్కువ యూజర్ బేస్ ఉన్న లాంగ్వేజ్ లలో సినిమాలు, వెబ్ సిరీస్ లని డబ్బింగ్ చేసి మరీ అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:32 AM GMT
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్ లు ఇవే
X

ఓటీటీ వీకెండ్ సందడి మొదలుకాబోతోంది. ప్రతివారం డిజిటల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం కొత్త కొత్త కంటెంట్ లతో సినిమాలు, వెబ్ సిరీస్ లని ప్రేక్షకుల ముందుకి ఆయా ఛానల్స్ తీసుకొని వస్తున్నాయి. ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. అయితే డిజిటల్ స్పేస్ పెరిగిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఎక్కువ యూజర్ బేస్ ఉన్న లాంగ్వేజ్ లలో సినిమాలు, వెబ్ సిరీస్ లని డబ్బింగ్ చేసి మరీ అందిస్తున్నారు.

ఏ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే ఇలా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి. వన్ డే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. అలాగే హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భక్షక్ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

లవర్ స్టాకర్ కిల్లర్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యింది. హాలీవుడ్ మూవీ హారిబుల్ బాసెస్ ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. బ్లాక్‌లిస్ట్ సీజన్- 10 సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి అందుబాటులోకి రానుంది. శివకార్తికేయన్ అయలాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఫిబ్రవరి 9న సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ తెలుగు డబ్బింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యింది.

అమెజాన్ ప్రైమ్ లో జోరుగా హుసారుగా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ హాట్ స్టార్ లో సుస్మితా సేన్ ఆర్య సీజన్ 3 వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యింది. జీ5లో దర్శన్ కన్నా మూవీ కటేరా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యింది. జియోలో హిందీ వెబ్ సిరీస్ హలో ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ హర్రర్ మూవీ ది నన్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ మూవీ ఫిబ్రవరి 9 నుంచి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఏవి ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీటిలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. అయితే ఫ్లాప్ సినిమాలకి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. శివకార్తికేయన్ అయలాన్ అయితే తెలుగు వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.