పెళ్లి తర్వాతా హద్దులు చెరిపేసిన ఏకైక గ్లామర్ క్వీన్
కొందరు నటవృత్తిలోకి తిరిగి ప్రవేశించినా కానీ హద్దులు దాటకుండా వృత్తిని కొనసాగిస్తున్నారు.
By: Tupaki Desk | 8 Dec 2023 4:39 PM GMTపెళ్లి తర్వాత చాలా మంది కథానాయికలు కేవలం సంసార బాధ్యతలకే పరిమితమైన వారు ఉన్నారు. చాలా మంది పెళ్లి తర్వాత నటనను విరమించారు. కొందరు నటవృత్తిలోకి తిరిగి ప్రవేశించినా కానీ హద్దులు దాటకుండా వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే వీరందరికీ భిన్నమైన నటి దీపిక పదుకొనే. పెళ్లి తర్వాతా హద్దులు దాటి చెలరేగడం దీపికకే చెల్లింది.
ముఖ్యంగా గ్లామర్ బార్డర్‌కి సంకెళ్లు తెంచేసిన దీపిక ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాల్లో జీవిస్తోంది. బికినీ బీచ్ సెలబ్రేషన్ కి అయితే కొదవేమీ లేదు. తన హీరోలతో ఘాటైన లిప్ లాక్ లు.. బెడ్ రూమ్ సన్నివేశాల్లో ఈ బ్యూటీ జీవించేస్తోంది. ఇంతకుముందు పఠాన్ లో కింగ్ ఖాన్ తో ఘాటైన సన్నివేశాల్లో నటించింది. అంతకుముందు గెహ్రయాన్ చిత్రంలో తనకంటే వయసులో చిన్నవాడైన సిద్ధాంత్ చతుర్వేదితో ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాల్లో జీవించింది. పెళ్లి తర్వాత ఈ స్పీడ్ కి ముక్కున వేలేసుకున్నారు. దీపికపై సోషల్ మీడియాల్లో చాలా విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో దీపిక చేసిన బోల్డ్ కామెంట్ ని కూడా ఎవరూ మర్చిపోలేరు. తనకు భర్త ఉండగానే స్నేహితులు ఉన్నారని దీపిక నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. దానిపై నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు దీపిక తన తదుపరి చిత్రం `ఫైటర్`తో తిరిగి వచ్చింది. ఫైటర్ టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం దీపిక గ్లామర్ ట్రీట్ స్కైని తాకింది. ముఖ్యంగా దీపిక-హృతిక్ నడుమ రొమాంటిక్ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి హీట్ పుట్టిస్తోంది. బికినీ బీచ్ లో హృతిక్ ఛాతిపై చేతిని ఉంచి దీపిక ఘాటైన రొమాన్స్ చేస్తోంది. ఈ షాట్ లో గ్లామర్ యాంగిల్ ప్రేమికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. స్కిన్ షో విషయానికి వస్తే దీపికకు ఎటువంటి సంకోచం లేకుండా చెలరేగిపోవడం కనిపిస్తోంది.
పెళ్లి తర్వాతా ఎటువంటి అభ్యంతరం లేకుండా గ్లామర్ ఎలివేషన్ తో చెలరేగడం దీపికకే చెల్లింది. ఇటు దక్షిణాదిన చాలా మంది కథానాయికలు పెళ్లి తరవాత అదుపులో ఉన్నారు. అనవసర బోల్డ్ యాక్ట్ ని వీళ్లలో చూడలేం. ఇటీవల పెళ్లయిన చాలా మంది దక్షిణాది కథానాయికలు ఇప్పుడు డీసెంట్ అప్పియరెన్స్ తో పబ్లిక్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. అయితే దీపిక అందుకు భిన్నంగా తన భర్తతో తనకు ఉన్న అండర్ స్టాండింగ్ గురించి మాట్లాడింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో దీపిక వాస్తవాన్ని అంగీకరించింది.