ది రైల్వే మెన్… ఒటీటీ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
ఈ మధ్యకాలంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ వస్తున్నాయి
By: Tupaki Desk | 19 Nov 2023 5:16 AM GMTఈ మధ్యకాలంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడో జరిగిన ఘటనలు కావడం, వాటి వెనుక వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకి తెలియకపోవడంతో ఈ జెనరేషన్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్. భోపాల్ గ్యాంగ్ దుర్ఘటన ఆధారంగా చేసుకొని ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.
కే కే మీనన్, బాబిల్ ఖాన్, మాధవన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఇందులో నటించారు. భోపాల్ గ్యాంగ్ లీక్ సమయంలో రైల్వే స్టేషన్ లో పనిచేసే వ్యక్తి ఎక్కువ మందిని ప్రాణాలకి తెగించి కాపాడాడు. అతను చెప్పిన ఆధారాల ద్వారా భోపాల్ ఘటనని దృశ్యరూపం చేశారు. అసలు ఆ ఘటన ఎలా జరిగింది. గ్యాంగ్ లీక్ సమయంలో ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు. అంతమంది ఎందుకు చనిపోయారు అనే విషయాలని ఈ వెబ్ సిరీస్ లో టచ్ చేశారు.
1984 లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ప్లాంట్ చుట్టూ ఉన్న చిన్న పట్టణాలలో 500,000 మందికి పైగా ప్రజలు విషపూరిత వాయువు బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. 15,000 మందికి పైగా మరణించినట్లు అనాధికార సమాచారం. ఇప్పటికి చాలా మంది గ్యాంగ్ లీక్ కారణంగా మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ విషయాలు అన్నింటిని వెబ్ సిరీస్ లో టచ్ చేశారు. అలాగే రైల్వే మెన్ తో పాటు మరికొంత మంది చేసిన సాహసాలు కూడా అద్భుతంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్క్రోర్ తో ఆవిష్కరించారు. దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన కావడంతో ఈ జెనరేషన్ లో చాలా మందికి దాని గురించి తెలియదు. ఈ కారణంగా వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
అలాగే సౌత్ లో కూడా ఈ సంఘటన గురించి మెజారిటీ ప్రజలకి అస్సలు తెలియదు. భోపాల్ గ్యాంగ్ లీక్ సంఘటన గురించి పుస్తకాలలో చదువుకోవడమే తప్ప పూర్తిగా అవగాహన లేదు. అందుక ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు.