Begin typing your search above and press return to search.

దిగులు త‌గ్గేందుకు యంగ్ హీరోయిన్‌కి థెర‌పీ

కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అన‌న్య‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కొన‌సాగింది. '

By:  Tupaki Desk   |   25 Nov 2024 7:30 PM GMT
దిగులు త‌గ్గేందుకు యంగ్ హీరోయిన్‌కి థెర‌పీ
X

సోష‌ల్ మీడియా వికృత చేష్ఠ‌ల‌కు సెల‌బ్రిటీలు ఎంతగా ఆందోళ‌న చెందుతారో, దిగులుతో కుంగిపోతారో ఈ మమ్మీ డాట‌ర్స్ చెప్పిన సంగ‌తులు విన్నాక అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ త‌న‌ను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేశాక నెటిజ‌నుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంది స‌ద‌రు స్టార్ కిడ్. నెపో కిడ్ అంటూ చాలా కించ‌ప‌రిచారు. అంతేకాదు.. న‌ట‌వార‌సురాలు.. ఇన్ సైడ‌ర్.. త‌న‌కు న‌టించ‌డం తెలియ‌దు! అంటూ తీవ్రంగా దూషించారు నెటిజ‌నం. అయితే దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆ మామ్ & డాట‌ర్ ఎంత‌గా త‌ల్ల‌డిల్లారో వారి మాట‌ల‌ను బట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇదంతా భావ‌నా పాండే- అన‌న్య పాండే గురించిన సంగ‌తి.

'లైగ‌ర్' చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన అన‌న్య పాండే ప్ర‌ముఖ న‌టుడు చంకీ పాండే - భావ‌నా పాండేల‌ కుమార్తె. త‌మ కుమార్తెను ట్రోల్ చేస్తుంటే ఆ త‌ల్లి మ‌న‌సు త‌ట్టుకోలేక‌పోయింద‌ట‌. దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు థెర‌పీ కి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని భావ‌నా పాండే తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. మొద‌టి సినిమాలో త‌న న‌ట‌న గురించి, నెపోటిజం గురించి నెటిజ‌నులు తీవ్రంగా విమ‌ర్శించార‌ని, దాంతో దిగులు చెందానని భావ‌న అన్నారు.

కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అన‌న్య‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కొన‌సాగింది. 'నేపో కిడ్' అనే ద్వేషాన్ని ఎదుర్కొంది. త‌న‌ నటనను ఎగతాళి చేశారు. 'వీ ది ఉమెన్‌' ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ భావన ఈ ట్రోలింగ్ తనను ఎంత‌గా ప్రభావితం చేసిందో ఓపెన‌య్యారు. ''నేను ఒక సంవత్సరం పాటు థెరపీలో ఉన్నాను.. దీనిని మేనేజ్ చేయ‌లేక‌పోయాను. ట్రోలింగ్ త‌నను(అన‌న్య‌ను) ప్ర‌భావితం చేయ‌డం కంటే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. నేను అతి సున్నిత మనస్తత్వం గల వ్యక్తిని. అలాంటి సమయాల్లో నేను కొన్నిసార్లు థెరపీ తీసుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన చుంకీ(భ‌ర్త‌)తో కూడా చాలా మాట్లాడతాను'' అని భావన చెప్పారు.

అనన్య పాండే కూడా నెపో కిడ్ విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోలేక థెరపీ చేయించుకున్నాన‌ని తెలిపారు. ''నేను నా భావోద్వేగాలను స్పష్టంగా చెప్పలేకపోయాను. నేను చాలా దిగులుగా ఉండేదానిని. మానసిక ఆరోగ్యం ప్ర‌భావిత‌మైంది'' అని అన‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. సోష‌ల్ మీడియా కొన్నిసార్లు ప్ర‌భావితం చేస్తుంది. ఇప్ప‌టికి అల‌వాటైంది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.. కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాను'' అని తెలిపింది. ''నాపై రాసిన‌వి చ‌దివిన కొన్ని వారాల తర్వాత విస్మరిస్తాను. కొన్నిసార్లు థెర‌పీతో బ‌య‌ట‌ప‌డతాను.. ఇప్ప‌టికి నా ఆలోచనలను కొంచెం మెరుగ్గా వ్యక్తీకరించగలిగాను'' అని కూడా అన‌న్య అన్నారు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న 'ఫ్యాబులస్ లైవ్స్ వ‌ర్సెస్ బాలీవుడ్ వైవ్స్‌'లో భావన క‌నిపించారు. అనన్య ప్రస్తుతం 'కాల్ మీ బే' రెండవ సీజన్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో లాయర్ సి శంకరన్ నాయర్ బయోపిక్ లోను అన‌న్య న‌టిస్తోంది. కొన్ని వారాల క్రితం.. 'చాంద్ మేరా దిల్‌' అనే చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.