Begin typing your search above and press return to search.

NBK 109: ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా..

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2024 12:49 PM GMT
NBK 109: ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా..
X

వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో గత ఏడాది మంచి హిట్లు అందుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు అదే జోష్ లో బాబీ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

అయితే సినిమాలో బాలయ్యను ఇప్పటి వరకు ఎవరూ చూపించని వైలెంట్ గా చూపిస్తానని డైరెక్టర్ బాబీ పలుమార్లు చెప్పారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో చెప్పినట్లే చూపించారు. బాలయ్య పవర్ ఫుల్ గెటప్ లో కనిపించారు. సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌.. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌ అంటూ బాలకృష్ణ తన మాస్ డైలాగ్ తో అలరించారు. యాక్షన్ తో అదరగొట్టేశారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

గ్లింప్స్ తోపాటు టైటిల్ ను కూడా మేకర్స్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ఇంకా వర్కింగ్ టైటిల్ NBK 109 తోనే మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు జోరుగా చర్చ సాగుతోంది. బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టు 'వీర మాస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే టైటిల్ ను ఖరారు చేశారని టాక్.

త్వరలో టైటిల్ తోపాటు మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. టైటిల్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలయ్య అని.. ఇప్పుడు ఆయన సినిమాకు వీర మాస్ టైటిల్ కన్ఫర్మ్ అయితే తిరుగులేదని అంటున్నారు. సోషల్ మీడియాలో వీర మాస్ అంటూ పోస్టులు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి డైరెక్టర్ బాబీ, నందమూరి నటసింహం ఈ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.