అక్కడ కింగ్ ప్రభాస్… ఈ లెక్కలే సాక్ష్యం
నైజాంలో కలెక్షన్స్ పరంగా చూసుంటే డార్లింగ్ ప్రభాస్ నైజాం కింగ్ అని ఒప్పుకోవాల్సిందే.
By: Tupaki Desk | 6 Jan 2024 4:11 AM GMTతెలంగాణ మొత్తం నైజాం ఏరియాగా వస్తుంది. థియేటర్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రాలో కంటే నైజాంలో తక్కువ. కాని కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రాని నైజాం ఏరియా ఎప్పటికప్పుడు బీట్ చేస్తూనే ఉంటుంది. సినిమాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ కూడా నైజాం ఎక్కువగానే ఉంటుంది. లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదని చెప్పాలి.
నైజాంలో కలెక్షన్స్ పరంగా చూసుంటే డార్లింగ్ ప్రభాస్ నైజాం కింగ్ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన నాలుగు సినిమాలు నైజాంలో సాలిడ్ గా 60 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. గ్రాస్, షేర్ ఏ లెక్కలు చూసుకున్న నైజాంలో ప్రభాస్ అత్యధిక సార్లు ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. నైజాంలో వంద కోట్ల కలెక్షన్స్ ఆర్ఆర్ఆర్, బాహుబలి2, సలార్ క్రాస్ చేశాయి. వీటిలో రెండు ప్రభాస్ సినిమాలే
ఇక 70 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే టాప్ లో కేజీఎఫ్ చాప్టర్2 ఉంది. దీని తర్వాత ప్రభాస్ బాహుబలి నిలిచింది. అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీకి నిలబడటం విశేషం. ఈ సినిమాతో పోల్చుకుంటే నైజాంలో అల్లు అర్జున్ పుష్పకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఈ మూవీ 70 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేయలేకపోయింది. అందుకే 60 కోట్ల గ్రాస్ క్లబ్ లో ఉండిపోయింది.
నెక్స్ట్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీ 60 కోట్ల గ్రాస్ ని నైజాంలో దాటింది. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య కూడా 60 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నెక్స్ట్ ప్రభాస్ తెలుగు డబ్బింగ్ మూవీ ఆదిపురుష్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 60 కోట్లకి పైగానే వసూళ్ళని రాబట్టింది. సంక్రాంతి సినిమాలలో గుంటూరు కారం మూవీకి వీటిలో ఏదో ఒక క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది.
ప్రభాస్ పేరు మీద అత్యధిక సార్లు నైజాంలో 60 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన హీరో అనే ఇమేజ్ ని బీట్ చేసే అవకాశం అయితే ఎవరికి ఉండకపోవచ్చు. దీనికి కారణం ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ కూడా అంతకుమించి అనే విధంగానే అన్ని ఉండబోతుండటమే.