నాని సినిమా సైలెన్స్ కి రీజన్ ఏంటి..?
దసరా సినిమాతో తను కూడా మాస్ హీరోనే అని ప్రూవ్ చేసుకున్న నాని సరిపోదా శనివారం సినిమాతో కూడా అలాంటి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని సినిమా గ్లింప్స్ చూశాక అర్ధమైంది.
By: Tupaki Desk | 6 Jun 2024 6:26 AM GMTన్యాచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న లాంటి హిట్ల తర్వాత చేస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దసరా సినిమాతో తను కూడా మాస్ హీరోనే అని ప్రూవ్ చేసుకున్న నాని సరిపోదా శనివారం సినిమాతో కూడా అలాంటి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని సినిమా గ్లింప్స్ చూశాక అర్ధమైంది. ఈ సినిమాను ఆగష్టు 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
ఆమధ్య సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి హడావిడి చేసిన మేకర్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సరిపోదా శనివార ఓ పక్క శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా సినిమా అనుకున్న టైం కు తీసుకొచ్చే ప్లానింగ్ లోనే ఉన్నారు. కానీ స్టార్ సినిమాలు కొన్ని రిలీజ్ లు అటు ఇటు అవుతున్న సందర్భంగా నాని సినిమా అనుకున్న డేట్ కి వస్తుందా రాదా అన్న డౌట్లు మొదలయ్యాయి. ఆగష్టు 15న అనుకున్న పుష్ప 2 రిలీజ్ డేట్ లో మార్పు లేదని తెలుస్తుండగా సెప్టెంబర్ 27న అనుకున్న OG వెనక్కి వెళ్లి ఆ ప్లేస్ లో ఎన్.టి.ఆర్ దేవర వస్తాడని చెబుతున్నారు.
ఇక అక్టోబర్ 10న రావాల్సిన దేవర బదులుగా రాం చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ వస్తుందని టాక్. సో ఇలా స్టార్ హీరోలు రిలీజ్ లు అటు ఇటు అవుతున్న సందర్భంగా నాని సినిమాను ఆగష్టు 27 నుంచి వెనక్కి తీసుకెళ్తారా అన్న డౌట్ మొదలైంది. ఐతే నాని సరిపోదా శనివారం మాత్రం ఆగష్టు మంత్ ఎండ్ రిలీజ్ అనౌన్స్ చేశారు. ఆ డేట్ కి పోటీ ఉండే ఛాన్స్ లేదు. కానీ సడెన్ గా ఏదైనా స్టార్ సినిమా ఆ డేట్ న వస్తామని అంటే మాత్రం నాని సినిమా వాయిదా పడే అవకాశం ఉంటుంది.
నాని సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న డివివి బ్యానర్ లోనే ఓజీ సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలను నెల గ్యాప్ లో రిలీజ్ చేయాలని దానయ్య ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాదు నాని నెక్స్ట్ సినిమా కూడా డివివి దానయ్య బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఓజీ డైరెక్టర్ సుజిత్ తో నాని హీరోగా సినిమా ప్లాన్ చేశారు. మరి నాని సరిపోదా శనివారం రిలీజ్ విషయంలో మరోసారి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా సినిమా రిలీజ్ పై డౌట్లు కొనసాగుతాయని చెప్పొచ్చు.