Begin typing your search above and press return to search.

బచ్చన్ vs ఇస్మార్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది?

దీంతో ఓపెనింగ్స్ విషయంలో రెండు చిత్రాలకు గట్టి పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 July 2024 10:06 AM GMT
బచ్చన్ vs ఇస్మార్ట్  ఎక్కడ స్టార్ట్ అయింది?
X

మిస్టర్ బచ్చన్ vs డబుల్ ఇస్మార్ట్.. ఇండిపెండెన్స్ రోజు టాలీవుడ్ లో బిగ్ క్లాష్ పక్కా. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్సెస్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో రెండు చిత్రాలకు గట్టి పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

రవితేజతో కెరీర్‌ స్టార్టింగ్‌ లో మంచి హిట్‌ సినిమాలు తీసి ఆయనను మాస్ మహా రాజాగా తీర్చిదిద్దారు పూరి జగన్నాథ్. దీంతో వీరిద్దరిదీ గురుశిష్యుల బంధంగా అభిమానులు భావిస్తారు. అయితే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా రిలీజ్ అయిన రోజే.. ఇప్పుడు రవితేజ మిస్టర్ బచ్చన్ విడుదలవుతుంది. దీని వల్ల పూరీ, రవితేజ మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ డేట్ మాత్రం రీసెంట్ గా అనౌన్స్ చేశారు. దీంతో పూరీ జగన్నాథ్‌ ఫీల్‌ అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ డిస్కషన్.. మేకర్స్ వల్ల కాదని ఓటీటీస్ వల్ల వచ్చాయని అంటున్నారు. రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయడం మేకర్స్ చేతుల్లో లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అయితే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆర్థిక సమస్యలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఒక ఫైనాన్షియర్ బిగ్ హెల్ప్ చేయడంతో షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినట్లు సమాచారం. దీంతో డిజిటల్ రైట్స్ విక్రయించిన తర్వాత.. ఆ డబ్బులతో రిటర్న్ ఇద్దామని అనుకున్నారట పూరీ. దీంతో మేకర్స్ డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు మొగ్గు చూపిన ఓ ఓటీటీ సంస్థ ఆగస్టు 15న విడుదల చేయాలని కండిషన్ పెట్టిందని వినికిడి. అదే టైంలో పుష్ప కూడా వాయిదా పడడంతో డేట్ ఫిక్స్ చేసేశారు.

ఇక మిస్టర్ బచ్చన్ మూవీ విషయంలో కూడా అలాగే జరిగిందట. ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్.. డిజిటల్ హక్కుల ద్వారా సాలిడ్ డీల్ కుదుర్చుకోవాలని యోచించిందట. దీంతో మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిన సంస్థ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయమని కండిషన్ పెట్టిందని తెలుస్తోంది. అక్కడికి రెండు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో అలా అనుకోకుండా రెండు సినిమాలు కూడా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. మరి వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.