Begin typing your search above and press return to search.

అక్కడ 'సలార్' డామినేషన్.. వేరే లెవెల్!

ప్రభాస్ డిజాస్టర్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ రావడంతో రెబల్ స్టార్ మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదని తాజాగా 'సలార్' మరోసారి నిరూపించింది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 1:39 PM GMT
అక్కడ సలార్ డామినేషన్.. వేరే లెవెల్!
X

టాలీవుడ్ దగ్గర హీరో ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు. భారతీయ సినీ చరిత్రలో ఒక్క సినిమాతో ఈ రేంజ్ లో పాపులారిటీ మరే హీరోకి రాలేదేమో. బాహుబలి తో ప్రభాస్ మార్కెట్ పదింతలు పెరిగింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ డిజాస్టర్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ రావడంతో రెబల్ స్టార్ మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదని తాజాగా 'సలార్' మరోసారి నిరూపించింది.

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే రూ.180 కోట్లు కలెక్ట్ చేస్తే రెండో రోజు అంతకుమించి రూ.300 కోట్లు వసూలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక సలార్ తో నార్త్ అమెరికాలో సోలో హీరోగా ఐదు మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీనికంటే ముందు 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'సాహో' సినిమాలు ఈ ఘనతను సాధించాయి.

తాజాగా ఈ క్లబ్ లో 'సలార్' కూడా చేరిపోయింది. ఇక తెలుగు నుంచి ప్రభాస్ సినిమాలు కాకుండా ఒక్క 'RRR' సినిమా మాత్రమే ఈ రికార్డు నెలకొల్పింది. ఓవరాల్ గా టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో వరసగా 5 స్థానాల్లో ప్రభాస్ సినిమాలే ఉండడం విశేషం. మొదటి రెండు స్థానాల్లో 'బాహుబలి 2', 'బాహుబలి 1' ఉంటే మూడో స్థానాన్ని 'సలార్' ఆక్రమించింది. సాహో, ఆదిపురుష్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

డిజాస్టర్ సినిమాలతోనూ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది. ఇక ఇప్పటికే రూ.400 కోట్ల క్లబ్ లో చేరిన సలార్ ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల మార్క్ ని అందుకనే దిశగా పరుగులు పెడుతోంది. ఓవర్సీస్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ హవా కొనసాగుతోంది. ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే నైజాం లో రూ.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సలార్ ఊపు చూస్తుంటే ఈ సినిమాని నైజాంలో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందింన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటించారు. శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందింన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించారు.