Begin typing your search above and press return to search.

ఇక సినిమాల రిలీజ్ బంద్.. ఎగ్జిబిట‌ర్లు స‌డెన్ షాక్!

నిర్మాతలు కూడా సినిమా డిజిటల్ విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని ఒప్పందాలను రూపొందిస్తారు

By:  Tupaki Desk   |   17 Feb 2024 1:41 PM GMT
ఇక సినిమాల రిలీజ్ బంద్.. ఎగ్జిబిట‌ర్లు స‌డెన్ షాక్!
X

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల‌ విస్తృతి పెరిగిన‌ప్పటి నుండి చిన్న థియేటర్ చైన్ ల‌ మనుగడ గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ప్రేక్షకులు సినిమాని థియేటర్‌లలో చూడటం కంటే OTT విడుదలయ్యే వరకు వేచి ఉండటానికి ఇష్టపడతారు. నిర్మాతలు కూడా సినిమా డిజిటల్ విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని ఒప్పందాలను రూపొందిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా OTTలో ప్రీమియర్‌లు ప్రదర్శించే ముందు థియేటర్‌లలో సినిమాలకు కనీస ప్రదర్శన వ్యవధిని డిమాండ్ చేస్తూ.. చిన్న థియేటర్ యజమానులు అనేక నిరసనలు చేస్తున్నారు.

కేరళ విషయానికొస్తే మ‌ల‌యాళ సినిమా ఓటీటీ రిలీజ్ గ్యాప్ 42 రోజులు.. అయితే నిర్మాతలు నిర్ణీత కాలవ్యవధిని నిరంతరం ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) శుక్రవారం నాడు సాహసోపేతమైన నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్రవరి 22 గురువారం నుండి మలయాళ చిత్రాలను ప్రదర్శించబోమని వారు హెచ్చరించారు. నిర్మాతల సంఘం అంగీకరించిన FEUOK నిర్దేశించిన OTT విండో పీరియడ్ నిబంధనలను, నిర్మాతలు నిరంతరం ఉల్లంఘిస్తున్నందున తాము ఇంత కఠినమైన చర్య తీసుకోవలసి వచ్చిందని అసోసియేషన్ తెలిపింది.

సినిమా థియేట్రికల్ విడుదల.. దాని OTT విడుదల మధ్య 42 రోజుల విండో ఉండాలనే నియమం ఉన్నప్పటికీ చాలా మంది నిర్మాతలు ఈ నిబంధనను ఉల్లంఘించారని చాలా ముందుగానే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాను విడుదల చేశారని FEUOK ప్రెసిడెంట్ K విజయకుమార్ అన్నారు.

ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజా చర్య వచ్చే వారం విడుదల కానున్న అనేక చిత్రాలపై ప్రభావం చూపడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇందులో దిలీప్ న‌టించిన‌ సినిమా... థంకమణి అనే సినిమా కూడా ఎగ్జిబిటర్ల చర్యతో ప్రభావితమవుతుంద‌ని తెలిసింది. అయితే ఇప్పటికే విడుదలైన మమ్ముట్టి బ్రహ్మయుగం ఇత‌ర చిత్రాలపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదు. భారీ అంచనాలున్న మంజుమ్మెల్ బాయ్స్ కూడా అనుకున్న విధంగానే థియేటర్లలో విడుదలవుతుందని స్పష్టం చేశారు.

FEUOK ఇలాంటి నిరసనకు దిగడం ఇదే మొదటిసారి కాదని గమనించడం ఆసక్తికరం. అసలైన సమస్య ఏమిట‌న్న‌ది బ‌లంగా చెప్ప‌డానికి ఇలాంటి నిర్ణ‌యం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్వతంత్ర సింగిల్ థియేటర్ల మనుగడపై ప్రభావం చూపుతుంది. మల్టీప్లెక్స్ చైన్‌లు దేశవ్యాప్తంగా బ్రాంచీలను కలిగి ఉన్నప్పటికీ స్వతంత్ర థియేట‌ర్ల‌ విషయానికి వస్తే.. మహమ్మారి తరువాత తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టమని భావించిన సందర్భాలున్నాయి. ఇటీవల చెన్నైలో ఉదయమ్ థియేటర్లు మూతపడడం కూడా ఇదే అంశానికి సంకేతంగా విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని ఎర్నాకుళం లేదా తిరువనంతపురం వంటి పారిశ్రామిక నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ప్రాబల్యం కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ స్వతంత్ర సింగిల్ థియేటర్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు మ‌రోసారి నిషేధం కారణంగా అభిమానులు తాము ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాను చూసే అవకాశం కూడా లేకుండా పోతోంది.